Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రభుత్వ విప్లు గువ్వల బాలరాజు,రేగా కాంతారావు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
బీజేపీని పాతిపెట్టేందుకు రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారని ప్రభుత్వ విప్లు గువ్వల బాలరాజు, రేగా కాంతారావు హెచ్చరించారు. సచివాయల గుమ్మటాలను కూల్చాలంటూ ఒక పార్టీకి అధ్యక్షుడిగా ఉన్న వ్యక్తి పిలుపునివ్వొచ్చా..? అంటూ వారు ప్రశ్నించారు. గురువారం హైదరాబాద్లోని బీఆర్ఎస్ శాసనసభాపక్ష కార్యాలయంలో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో వారు మాట్లాడుతూ... బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజరు, పీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి, సీఎం కేసీఆర్పై ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారంటూ విమర్శించారు. వార్తల్లో ఉండటం కోసమే వారు ఆ విధంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ నోటిఫికేషన్లను విడుదల చేయటాన్ని కూడా బండి సంజరు తప్పుపట్టటం విడ్డూరంగా ఉందన్నారు.ఆయనతోపాటు రేవంత్రెడ్డి ప్రభుత్వాన్ని తిట్టటంలో పోటీ పడుతున్నారని విమర్శించారు. ఇలాంటి తిట్ల పురాణాలతో అధికారం రాదని ఎద్దేవా చేశారు.