Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
జాతీయ చేనేత దినోత్సవం (ఆగస్టు-7) సందర్భంగా ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ పేరిట అవార్డులను ప్రదానం చేయాలని రాష్ట్ర చేనేత, జౌళి శాఖ నిర్ణయించింది. ఈ అవార్డుల కోసం అర్హులైన చేనేత కళాకారుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నామని ఆ శాఖ అదనపు సంచాలకులు వెంకటేశం ఒక ప్రకటనలో తెలిపారు. దరఖాస్తు చేసుకోవాలనుకునే చేనేత కళాకారుల వయస్సు 31.12.2022 నాటికి 30 యేండ్లు నిండి ఉండాలనీ, వృత్తిలో 10 సంవత్సరాల అనుభవం ఉండాలని తెలిపారు. చేనేత డిజైనర్లకు 31.12.2022 నాటికి 25 యేండ్లు నిండి ఉండాలనీ, వృత్తిలో ఐదు సంవత్సరాలు అనుభవం ఉండాలని సూచించారు. దరఖాస్తులను 15.04.2023 లోగా ఆయా జిల్లాల చేనేత, జౌళి శాఖ సహాయ సంచాలకులకు సమర్పించాలని పేర్కొన్నారు.