Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వీడియో కాన్ఫరెన్స్లో సీఎస్ శాంతికుమారి
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
కంటి వెలుగు కార్యక్రమాన్ని మే నెలాఖరు వరకూ కొనసాగించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఉన్నతాధికారులను ఆదేశించారు .ప్రిస్క్రిప్షన్ ఆధారంగా ఇచ్చే కంటి అద్దాల పంపిణీలో జాగ్రత్త వహించాలని సూచించారు. కంటి వెలుగు, ఇంటి స్థలాల ఎంపిక, పోడు భూముల కేటాయింపు, హరిత హారం తదితర అంశాలపై గురువారం జిల్లా కలెక్టర్లతో బీఆర్కేఆర్ భవన్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎండలు తీవ్ర మవుతున్న నందున నేపథ్యంలో కంటి వెలుగు శిబిరాల వద్ద మంచినీటి సరఫరా, టెంట్లు ఏర్పాటు చేయాలని సూచించారు.
రాష్ట్రంలో నిరుపేదలకు భూమి పట్టాలను ప్రధానం చేయడా నికి వీలుగా అర్బన్ ప్రాంతాల్లో ప్రభుత్వ భూములు, నివాసం ఉంటున్న వారి వివరాలను శాసన సభ నియోజక వర్గాల వారీగా సేకరించి వెంటనే ప్రభుత్వానికి పంపాలని ఆదేశించారు. పోడు భూములకు సంబంధించి యాజమాన్య పట్టాలను అందించేం దుకు జిల్లా స్థాయి కమిటీ లో ఆమోదం పొందిన వాటికి పాస్ పుస్తకాలను రూపొందించాల న్నారు. హరిత హారం కార్యక్రమంలో భాగంగా 2023-24లో పెద్ద ఎత్తున మొక్కలు నాటేందుకు కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని కలెక్టర్లను ఆదేశిం చారు. ప్రభుత్వ ఉత్తర్వులు 58, 59, 76, 118 జీవోల ప్రకారం లబ్ధిదారుల ఎంపిక పూర్తయిన వారందరికీ రిజిస్ట్రేషన్లు వెంటనే చేపట్టాలని తెలి పారు. ఆయా జిల్లాలో పూర్తయిన సమీకృత జిల్లా కలెక్టరేట్లను నూతన కార్యాలయాల్లోకి తరలించే ప్రక్రియను పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్లో మున్సిపల్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్ కుమార్, పంచాయితీ రాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, రెవిన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిట్టల్, గిరిజన సంక్షే మ శాఖ కార్యదర్శి క్రిస్టినా చోంగ్తు, రోడ్లు భవనాల శాఖ కార్యదర్శి శ్రీని వాస రాజు, వైద్య ఆరోగ్య శాఖ కార్య దర్శి రిజ్వీ, పీసీసీఎఫ్ డోబ్రియల్ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.