Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రూ.60 కోట్లమేర ప్రభుత్వ మొండి బకాయిలు
- సబ్సిడీకి మంగళం
- విత్తనాల సరఫరాకు స్వస్తి
- నిర్వీర్యమవుతున్న హాకా
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
రైతులకు సబ్సిడీ విత్తనాలు అందించే ప్రతిష్టాత్మకమైన హైదరాబాద్ అగ్రికల్చర్ కో ఆపరేటివ్ అసోసియేషన్ (హాకా) ఆర్థిక వనరులు లేక ఇబ్బందులు పడుతున్నది. ఉమ్మడి రాష్ట్రంలో విత్తన సరఫరాలో కీలకంగా వ్యవహరించిన ఈ సంస్థకు...ప్రస్తుతం ఉనికే ప్రశ్నార్థకంగా మారింది. ఆర్థిక వనరులు లేకపోవడం, నిధులు సమీకరణకు సర్కారు సహ కారం అందకపోవడంతో అది ఉన్నా లేనట్టుగానే ఉన్నది. రాష్ట్ర ప్రభుత్వం రైతు బంధు పథకం అమలు చేస్తున్న నేపథ్యంలోవిత్తన సబ్సిడీకి స్వస్తి పలికింది. దీంతో ఆ సంస్థ కష్టాల ఊబిలోకి కూరుకుపోయింది. రాష్ట్రం ఏర్పడిన తర్వా త రెండేండ్లపాటు రైతులకు విత్తనాలు సరఫరా చేసినందుకు గానూ సర్కారు హాకాకు రూ 60 కోట్లు బకాయిలు పడింది. ఆరేండ్లు గడుస్తు న్నా...ఇప్పటికీ ఆ నిధులు విడుదల చేయడం లేదు. అనేక సార్లు ప్రభుత్వా నికి మొరపెట్టుకున్న ప్పటికీ ఎలాంటి ప్రయోజనం లేకుండాపోయింది.
నాడు పోచారం...నేడు సింగిరెడ్డి
నాటి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీని వాసరెడ్డి పట్టించుకోలేదు. ఆ తర్వాత బాధ్యతలు చేపట్టిన సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి కూడా ఆ సంస్థకు పూర్వవైభవాన్ని తీసుకొచ్చేందుకు ఎలాంటి ప్రయత్నం చేయడం లేదనే విమర్శలొస్తున్నాయి. వ్యవసాయ శాఖ ముఖ్యకార్యదర్శి, కమిషన ర్లు ఎవరొచ్చినా హాకాను గాలికొదిలేశారు. కొత్త రాష్ట్రం లో కనీసం చైర్మెన్‌ను కూడా నియమించలేదు. ఎనిమిదేండ్ల తర్వాత ఎట్టకేలకు మొన్న ఫిబ్రవరి 15న కొత్తగా చైర్మెన్‌ను రాష్ట్ర ప్రభుత్వం నియమిం చింది. సన్న చిన్నకారు రైతులకు సరసమైన ధరలకు విత్తనాలు సరఫరా చేసే హాకాను రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో అది నేడు నిర్వీర్యమవుతున్నది. క్రమక్రమంగా తన ప్రాధాన్యత ను కోల్పోతు న్నది. ఒకప్పుడు రైతులకు మేలురకం విత్తనాలు అందజేసిన సంస్థ ఇప్పు డు కార్యకలాపాలు లేక కూనారిల్లుతు న్నది. ఇటు రాష్ట్ర ప్రభుత్వం నుంచి సబ్సిడీ నిధులు విడుదల కాకపోవడం తో సంస్థ మనుగడే ప్రశ్నా ర్ధకంగా మారింది. ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ లోనూ ఆ తర్వాత ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన కొత్తలోనూ కర్ణాటక, మహా రాష్ట్ర తదితర రాష్ట్రాల్లో విత్తనాల అమ్మకాలను సాగించింది. చివర కు దీపావళి పండుగకు టపాసుల వ్యాపారం చేసింది. అయినప్పటికీ సంస్థల కష్టాల నుంచి గట్టెక్కలేదు.
పాల సరఫరాకే పరిమితం
అన్నదాతలకు నాణ్యమైన విత్తనా లను అందించాల్సిన సంస్థ ఇప్పుడు కేవలం అంగన్వాడీ కేంద్రాలకు పాలు సరఫరా చేసే సంస్థగా మారింది. వివిధ ఏజెన్సీల ద్వారా నాణ్యమైన పాలు సేకరించి అంగన్వాడీ కేంద్రా ల్లోని పిల్లలకు అందిస్తున్నది. దీంతో పాటు కందిపప్పు కూడా సరఫరా చేస్తున్నది. ఐదేండ్ల క్రితం వరకు రైతులకు అపరాలు, పెసర్లు, మినుములు వంటి పప్పు ధాన్యాలు, నజ్జలు, రాగులు వంటి చిరుధాన్యాలకు సంబంధించిన విత్తనాలు సబ్సిడీపై ప్రతి మండల కేంద్రంలో అందు బాటులో ఉంచేది. మూడేండ్లుగా ప్రభుత్వం సబ్సిడీకి మంగళం పాడటంతో సంస్థ కూడా ఏమీ చేయ లేక చేతులెత్తేసింది. వ్యాపార కార్యకలా పాలు తగ్గిపోయిన నేపధ్యంలో ఉద్యోగుల జీతభత్యాలను చెల్లించడం కూడా కష్టంగా మారింది. ఈ పరిస్థితు ల్లో పెండింగ్ పడిన ఆ సబ్సిడీ మొత్తాన్ని విడుదల చేయడంతోపాటు రాయితీపై విత్తనాలు అందించే విషయంలో రాష్ట్ర ప్రభుత్వ సహకారా న్ని ఉన్నతాధికారులు కోరుతున్నారు.
కొత్త చైర్మెన్‌కు సవాళ్లు
ఇటీవల హాకా చైర్మెన్‌గా నూతనంగా నియమితులైన మచ్చా శ్రీనివాసరావు పలు సవాళ్లు ఎదుర్కోనున్నారు. సంస్థకు పూర్వవైభవం తీసు కొచ్చేందుకు ఇప్పటికే కీలక సమావేశం నిర్వహించి నట్టు తెలిసింది. వ్యాపార కార్య కలాపాలను విస్తరించేం దుకు ఉన్న అవకాశాలను అందిపుచ్చు కునేందుకు సంప్రదింపులు జరుపుతు న్నట్టు సమాచారం. రైతులకు విత్తనా లు అందించడం తోపాటు వ్యవసాయ రంగంలో తన సేవలను కొనసాగిం చేందుకు ఏం చర్యలు తీసుకుంటే బాగుంటుందో ఆయా రంగాల నిపుణులతో చర్చిస్తున్నారు. దీనికి రాష్ట్ర ప్రభుత్వం సహకరించి ఇవ్వాల్సి న బకాయిలను ఇస్తే సంస్థ నిలబడు తుంది. రైతుకు చేయూతనిస్తుంది.