Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీసీరోడ్లు, డ్రైనేజీలు, జీపీ భవనాల సమీక్షలో సందీప్‌కుమార్ సుల్తానియా ఆదేశం
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ఉపాధి హామీ చట్టంలో భాగంగా చేపట్టిన సీసీరోడ్లు, డ్రెయినేజీలు, గ్రామపంచాయతీ భవనాల పనులకు ప్రాధాన్యతనిచ్చి మార్చి 25లోగా పూర్తిచేయాలని అధికారులను రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా ఆదేశించారు. శుక్రవారం హైదరాబాద్‌లోని బీఆర్కే భవన్ నుంచి స్థానిక సంస్థల అదనపు కలెక్టర్లు, డీఆర్డీఓలు, పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఉపాధి హామీ చట్టం కింద మంజూరైన పనులు, గ్రౌండింగ్ పనుల ప్రగతిపై సమీక్షించారు. మార్చి 25 లోగా పనులు పూర్తిచేసి ఎఫ్టిపిలో నమోదుచేస్తేనే కేంద్రం నుంచి నిధులు వచ్చే అవకాశం ఉందని తెలిపారు. పనుల ప్రాధాన్యతను గుర్తించి ఆయా జిల్లాలలో అందుబాటులో ఉన్న మెటీరియల్ కాంపోనెంట్ కింద ఉన్న నిధుల ఆధారంగా పనులు ప్రాధాన్యత ప్రకారం చేపట్టాలని సూచించారు. కూలీలను పెద్దఎత్తున వినియోగించి సకాలంలో పూర్తి చేయాలని ఆదేశించారు. పనుల మంజూరు, పనుల తీరుతన్నులపై స్థానిక సంస్థల అదనపు కలెక్టర్లు తరచూ ఇంజినీరింగ్ అధికారులతో సమీక్షలు జరపాలని సూచించారు. చేపట్టిన పనులన్నీ నాణ్యతతో కూడి ఉండాలని స్పష్టం చేశారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ హనుమంతరావు, స్పెషల్ కమిషనర్ ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.