Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలను ఎన్నారై బీఆర్ఎస్ బహ్రెయిన్ శాఖ అధ్యక్షులు రాధారపు సతీష్ కుమార్ ఆధ్వర్యంలో శుక్రవారం బహ్రెయిన్‌లో ఘనంగా నిర్వహించారు. సతీష్ కుమార్ కేక్ కట్ చేసి కేసీఆర్ కుజన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఎన్నారై బీఆర్ఎస్ బహ్రెయిన్ శాఖ అధ్యక్షులు రాధారపు సతీష్ కుమార్, ఉపాధ్యక్షులు బొలిశెట్టి వెంకటేష్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రాన్ని పోరాడి సాధించమే కాక రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా ఎనిమిదిన్నరేండ్లుగా నిరుపేదల సంక్షేమం కోసం ఆయన అమలు చేస్తున్న ఎన్నో సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయని కొనియాడారు. దేశంలో గుణాత్మక మార్పుకోసం ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ పార్టీ జెండాను సైతం బహ్రెయిన్‌లో కేసీఆర్ జన్మదినం సందర్బంగా ఆవిష్కరించడం గర్వంగా ఉందన్నారు. ముఖ్యమంత్రి నిండు నూరేండ్లు ఆరోగ్యాంగా , సంతోషంగా ఉండి భారత దేశాన్ని అభివృద్ధి చేయాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఎన్నారై బీఆర్ఎస్ సెల్ ప్రధాన కార్యదర్శి పుప్పాల బద్రి, మగ్గిడి రాజేందర్, అన్నారం సుమన్ ,కార్యదర్శులు చెన్నమనేని రాజేందర్ ,సంగేపోలు దేవన్న , ఉత్కం కిరణ్ గౌడ్ పాల్గొన్నారు.
కేసీఆర్ జన్మదిన వేడుకలు రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో ఘనంగా జరిగాయి. పీవీ మార్గ్‌లోని థ్రిల్ టీలో భారీఎత్తున నిర్వహించిన వేడుకల్లో సీఎం కేసీఆర్ 69వ పుట్టిన రోజు కేక్‌ను కట్ చేశారు. 10 వేల మందికి అన్నదానం చేశారు. సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, ఎంపీ కె.కేశవరావు, మంత్రి గంగుల కమలాకర్,ఎమ్మెల్సీ వాణీదేవి, ఎమ్మెల్యేలు ముఠా గోపాల్, దానం నాగేందర్, హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్, పలువురు చైర్మన్లు, తదితర నేతలు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.