Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఈడీ, సీబీఐకు ఫిర్యాదు చేశాం : దాసు సురేశ్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
కాసం వెడ్డింగ్ మాల్లో నకిలీ పోచంపల్లి ఇక్కత్ చీరలు అమ్ముతూ దేశ ప్రతిష్టను మసక బారుస్తున్నారంటూ ఈడీ, సీబీఐలకు ఫిర్యాదు చేశామని బీసీ రాజ్యాధికార సమితి అధ్యక్షులు దాసు సురేశ్ తెలిపారు. ఒకే వ్యక్తి 30 మేరకు షాపులను నిర్వహిస్తూ మనీ లాండరింగ్, ఇన్ సైడ్ ట్రేడింగ్‌కు పాల్పడుతున్నారని ఆరోపించారు. శుక్రవారం ఢిల్లీలోని తెలంగాణ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడారు. పట్టుబడిన నకిలీ పోచంపల్లి ఇక్కత్ చీరలను ప్రదర్శించారు. కాసం వెడ్డింగ్ మాల్ యజమానులు అగ్రశ్రేణి సినీతారలతో ప్రచారం చేయిస్తూ ప్రజలను నమ్మించి వేల కోట్ల ఆదా యాన్ని అక్రమంగా ఆర్జిస్తున్నారని ఆరోపించారు. చేనేత కార్మికుల సంపదను కార్పొరేట్ షాంపింగ్ మాల్స్ ఈ రకంగా దోచుకుంటున్నాయని విమర్శిం చారు. వాటి మోసాన్ని ఆధారాలతో సహా పీఎంఓ కార్యాలయం, కేంద్ర మంత్రులు నిర్మలాసీ తారామన్, పీయూష్‌గోయల్ కార్యాలయాలకు, ఎంఫోర్సు మెంట్ డైరెక్టర్‌కు, సీబీఐ డైరెక్టర్‌కు, జాతీయ బీసీ కమిషన్ చైర్మెన్‌కు, హ్యాండ్లూమ్ బోర్డు కమిషనర్‌కు తెలియ జేశామన్నారు. భవిష్యత్తులో ఎవరైనా చేతి వృత్తి దారుల శ్రమను కొల్లగొడితే కటకటాలపాలు చేస్తా మని హెచ్చరించారు. చేనేత వస్త్రాలకు, మిల్లు వస్త్రా లకు ఒకే ట్యాక్స్ స్లాబ్ ను కొనసాగించడం వల్లనే వ్యాపారసంస్థలు అక్రమాలకు పాల్పడుతున్నాయని వివరించారు. మిల్లు వస్త్రాలపై 12 శాతం ట్యాక్సును విధించాలనీ, చేనేతపై పన్ను మినహాయించాలని ఆయన ఈ సందర్భంగా కోరారు.