Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
ముఖ్యమంత్రి కే చంద్రశేఖర రావు 69వ జన్మదినం సందర్భంగా విద్యుత్ ఉద్యోగులు శుక్రవారం మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. విద్యుత్ సౌధలో ఇంధన శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ సునీల్‌శర్మ, టీఎస్ జెన్కో, ట్రాన్స్‌కో సీఎమ్‌డీ దేవులపల్లి ప్రభాకరరావు ఈ శిబిరాన్ని ప్రారంభించారు. పీవీ నర్సింహారావు మెమొరియల్ ఛారిటబుల్ ట్రస్ట్, టీఎస్ జెన్కో సంయుక్తాధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు విద్యుత్ ఉద్యోగులు స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. సీఎం కేసీఆర్ జన్మదినం సందర్భంగా విద్యుత్ ఉద్యోగులు మంచి కార్యక్రమం చేపట్టారని సునీల్‌శర్మ, ప్రభాకరరావు కొనియాడారు. రక్తదాన ప్రాధాన్యతను వివరించారు. రాష్ట్రప్రభుత్వం చేపడుతున్న పలు సంక్షేమ పథకాలను ప్రస్తావించారు. సీఎం కేసీఆర్ దూరదృష్టితోనే రాష్ట్రంలో 24 గంటల నిరంతర విద్యుత్ సరఫరా సాధ్యమైందని తెలిపారు. కార్యక్రమంలో తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఇంజినీర్స్ అసోసియేషన్ అధ్యక్షులు ఎన్ శివాజీ, టీఎస్ జెన్కో జేఎమ్డీ సీ శ్రీనివాసరావు, డైరెక్టర్ అశోక్‌కుమార్, పీవీ నర్సింహారావు మెమొరియల్ చారిటబుల్ ట్రస్ట్ సీఈఓ డాక్టర్ ఎన్వీ సుధాకరన్, సివిల్ సర్జన్ ధీరజ్నాయక్ తదితరులు పాల్గొన్నారు.