Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నాగోల్
సీఎం కేసీఆర్ పుట్టిన రోజును పురస్కరించుకొని హైదరాబాద్లోని శివరాంపల్లిలో గల రాఘవేంద్ర కాలనీలో ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ తెలంగాణ విభాగం, తలసేమియా ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ శిబిరానికి రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మెన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తాలు హాజరై మాట్లాడారు. ఈ మెగా రక్తదాన కార్యక్రమం తలసేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారుల కోసం నిర్వహిస్తున్నట్టు తెలిపారు. రక్తదాన శిబిరంలో పాల్గొన్న యువకులకు, స్వచ్ఛంద సంస్థ సభ్యులకు సర్టిఫికెట్లు అందజేసి సన్మానించారు. శిబిరా నికి వచ్చిన వారికి అన్నదాన కార్యక్రమం నిర్వహిం చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడు తూ.. 'ప్రతి ఒక్కరమూ రక్తదానం చేద్దాం.. ఆపదలో ఉన్నవారికి అండగా నిలుద్దాం.. ఇదే మన ప్రజా నాయకుడికి అందించే అ పూర్వ కానుక' అన్నారు. ాజేం ద్రనగర్ కార్పొరేటర్ అర్చన, తలసేమియా సొసైటీ సీఈఓ సుమా జైని, రత్నావళి, కమిటీ సభ్యులు ఐవీఎఫ్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.