Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఎం పుట్టినరోజు సందర్భంగా..
నవతెలంగాణ -గజ్వేల్
సీఎం కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా గజ్వేల్‌లో వినూత్న కార్యక్రమానికి మంత్రి హరీశ్‌రావు శ్రీకారం చుట్టారు. గజ్వేల్ రింగు రోడ్డు చుట్టూ మొక్కలు నాటే కార్యక్రమాన్ని శుక్రవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్ర ముఖ్యమంత్రి, గజ్వేల్ శాసనసభ్యులు కల్వకుంట్ల చంద్రశేఖర రావు 69వ జన్మదిన వేడుకల సందర్భంగా గజ్వేల్‌లో గల్లీగల్లీలో వేడుకలను ప్రజల సమక్షంలో నిర్వహించడం దేశ చరిత్రలో నిలిచిపోతుందన్నారు. రూ.300 కోట్లతో 24 కిలోమీటర్ల దూరంతో చేపట్టిన గజ్వేల్ రింగ్ రోడ్డు మరో నెల రోజుల్లో పూర్తవుతుందని తెలిపారు. గజ్వేల్ పట్టణంలోని స్థానిక వ్యవసాయ మార్కెట్లో చైర్మెన్ శ్రీనివాస ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ సైకా చిత్రపటం అందరిని ఆకర్షిస్తుందన్నారు. రక్తదాన శిబిరాలు, అన్ని దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించి గజ్వేల్ ప్రజలు, ప్రజాప్రతినిధులు సీఎంపై అత్మాభిమానాన్ని చాటుకుంటున్నారని చెప్పారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, జిల్లా ఎస్పీ శ్వేత, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్సీ డా.యాదవ రెడ్డి, జిల్లా పరిషత్ చైర్పర్సన్ రోజా శర్మ, గజ్వేల్ స్పెషల్ అధికారి ముత్యం రెడ్డి, తెలంగాణ ఫారెస్ట్ చైర్మెన్ ప్రతాప్ రెడ్డి, గ్రంథాల అభివృద్ధి సంస్థ చైర్మెన్ లక్కిరెడ్డి, ప్రభాకర్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మెన్ మాదాసు శ్రీనివాస్, మున్సిపల్ చైర్మెన్ రాజమౌళి, వైస్ చైర్మెన్ జాకీర్, ఆత్మ కమిటీ చైర్మన్ చైర్మెన్ కష్ణారెడ్డి, తెలంగాణ రాష్ట్ర ఎంపీటీసీల పోరం వర్కింగ్ ప్రెసిడెంట్ దేవీ రవీందర్, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.