Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
భైంసాలో ఆర్ఎస్ఎస్ ఈ నెల 19న వెయ్యి మందితో రూట్‌మార్చ్ నిర్వహించేందుకు అనుమతివ్వాలనే పిటిషన్‌పై హైకోర్టులో విచారణ 20కి వాయిదా పడింది. ఆర్ఎస్ఎస్ భైంసా ప్రతినిధి ఎస్.కృష్ణదాస్ దాఖలు చేసిన లంచ్‌మోషన్ పిటిషన్ జస్టిస్ విజరు సేన్‌రెడ్డి శుక్రవారం విచారిం చారు. ఇది దేశ వ్యాప్తంగా నిర్వహించే కార్యక్రమమనీ, పోలీసులు అనుమతిం చేలా ఆదేశాలు ఇవ్వాలంటూపిటిషనర్ న్యాయవాది కోరారు. దీనిపై ప్రభుత్వ ప్లీడర్ రవీందర్ వాదనలు వినిపిస్తూ.. పోలీసులు ఇప్పటివరకు అనుమతి నిరాకరిస్తూ ఎలాంటి లిఖిత పూర్వక ఆదేశాలు ఇవ్వలేదని చెప్పారు. సున్నిత ప్రాంతం కావడంతో గతంలో బీజేపీ సభకు కూడా భైంసాలో అనుమతి చ్చేందుకు ఇదే కోర్టు నిరాకరించదని గుర్తు చేశారు. పట్టణానికి 3 కిలో మీటర్ల. దూరంలో రూట్మార్చ్ను జరుపుకోవాలని ఆదేశిందన్నారు. 19న ముస్లింలు షబ్ ఇ బరాత్ ర్యాలీ నిర్వహిస్తారనీ, ఆర్ఎస్ఎస్కు కూడా ర్యాలీ నిర్వహిస్తే ఉద్రిక్త పరిస్థితులు తలెత్తే అవకాశం ఉంటుందని తెలిపారు. అయితే తాము 20న( సోమవారం) లేదా మరో తేదీన నిర్వహించుకునేందుకు అనుమతివ్వా లని పిటిషనర్ తరపు న్యాయవాది కోరారు. దీంతో న్యాయ మూర్తి.. దరఖాస్తును పరిశీలించి, అనుమతి ఇవ్వాలని ఆదేశించారు. ఎలాంటి అవాంచనీయ ఘటనలు జరుగకుండా చూడాల్సిన బాధ్యత పిటిషనర్దేనని స్పష్టం చేశారు. తదుపరి విచారణను ఈ నెల 20కి వాయిదా వేశారు.
ఎంపీ అరవింద్‌కు వెసులుబాటు
సీఎం కేసీఆర్‌ను సోషల్ మీడియా వేదికగా కించపరిచారనే పోలీసుల కేసుల దర్యాప్తును నిలిపి వేయాలని కోరుతూ నిజామాబాద్ ఎంపీ అరవింద్ దాఖలు చేసిన కేసులో హైకోర్టు స్టే విధించింది. ఎంపీపై తదుపరి చర్యలు తీసుకో రాదని పేర్కొంటూ ప్రధాన న్యాయ మూర్తి ఉజ్జల్ భూయాన్ శుక్రవారం ఆదేశించారు. విచారణను ఏప్రిల్ 21కి హైకోర్టు వాయిదా వేశారు. కేసీఆర్‌ను కించపరిచేలా కార్డూన్ను పోస్ట్ చేశారంటూ అరవింద్ పై 2022 జనవరిలో వనస్థలిపురం, బంజారాహిల్స్ పోలీస్స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. బంజారా హిల్స్‌లో నమోదైన కేసులో ట్రయల్ కోర్టు విచారణ చేపట్టింది. దీనిపై స్టే విధించాలన్న అరవింద్ వినతిని హైకోర్టు ఆమోదించింది.
సీబీఐ కేసు కొట్టేయండి
మంత్రి సబిత విజ్ఞప్తి
ఓబుళాపురం మైనింగ్ అక్రమాల కు సంబంధించి సీబీఐ తనపై నమోదు చేసిన కేసును కొట్టేయాలని మంత్రి సబితా ఇంద్రారెడ్డి దాఖలు చేసిన క్యాష్ పిటిషన్‌ను హైకోర్టు శుక్రవారం విచారించింది. గనుల మంత్రిగా ఉన్న పాపానికి తనను కేసులో ఇరికించారనీ, తనపై సీబీఐ నమోదు చేసిన చార్జిషీట్‌ను రద్దు చేయాలని ఆమె కోర్టును కోరారు. దీనిపై విచారణను వచ్చే శుక్రవారం కొనసాగిస్తామని ప్రధాన న్యాయమూర్తి ఉజ్జల్ భూయాన్ ప్రకటించారు.
చెరువు విస్తరణ పనులపై స్టే
నిర్మల్‌లోని నాయబ్ ట్యాంక్ ఫుల్ ట్యాంక్ లెవల్(ఎఫ్టీఎల్) పరిధిలో తాము తదుపరి ఆదేశాలు ఇచ్చేంత వరకు ఎలాంటి రోడ్డును వేయొద్దం టూ రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను మార్చి 17కు వాయిదా వేస్తూ ప్రధాన న్యాయమూర్తి ఉజ్జల్ భూయాన్, జస్టిస్ తుకారాంజీలతో కూడిన డివిజన్ బెంచ్ ఉత్తర్వులు జారీ చేసింది. ఎఫ్టీఎల్ పరిధిలో రోడ్డు నిర్మాణ నోటిఫికేషన్‌ను రద్దు చేయాలని సీనియర్ న్యాయవాది సూర్యకరణ్‌రెడ్డి కోరారు. దీనిపై ప్రభుత్వం స్పందిస్తూ, ఆ రోడ్డు 40 ఏండ్లుగా ఉందనీ, ఇప్పుడు విస్తరణ పనుల కోసమే నోటిఫికేషన్ వెలువ డిందని తెలిపింది. దీనిపై హైకోర్టు, తాము తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు ఎలాంటి ప్రక్రియ చేపట్ట వద్దంటూ ఆదేశిస్తూ, విచారణను వాయిదా వేసింది.