Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
ప్రజలు పోస్టాఫీసుల్లో సేవింగ్స్ ఖాతాలు ఓపెన్ చేయాలని ఆ సంస్థ విజ్ఞప్తి చేసింది. బ్యాంకులకంటే పోస్టల్ ఖాతాల్లో వడ్డీ రేటు ఎక్కువగా ఉంటుందనీ, దీనివల్ల ప్రజలకు అధిక ఆర్థిక ప్రయోజనాలు లభిస్తాయని శనివారంనాడొక పత్రికా ప్రకటనలో తెలిపారు. పోస్ట్‌మ్యాన్ ప్రజల ఇంటి వద్దకే వచ్చి సేవింగ్స్ ఖాతాలు ఓపెన్ చేస్తారనీ, దరఖాస్తులతో పాటు డబ్బులు కూడా అక్కడే సేకరిస్తారని చెప్పారు. ఇండ్ల వద్దే పాస్‌బుక్‌లు ఇస్తారనీ, ఈ సేవలకు ఎలాంటి అదనపు చార్జీలు ఉండబోవన్నారు. పోస్టాఫీసుల్లో వివిధ రకాల పొదుపు ఖాతాలు, స్కీంలు ఉన్నాయనీ వాటిని సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. సీనియర్ సిటిజన్ సేవింగ్స్ ఖాతాకు 8 శాతం, సుకన్య సమృద్ధి యోజన ఖాతాకు 7.6 శాతం, కిసాన్ వికాస్ పత్రకు 7.2 శాతం వడ్డీ లభిస్తుందని వివరించారు. అలాగే నెలవారీ ఆదాయ పథకానికి 7.1 శాతం, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్)కు 7.1 శాతం, నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్లకు 7 శాతం వడ్డీ ఇస్తారని తెలిపారు. టైం డిపాజిట్లు, రికరింగ్ డిపాజిట్లు, సేవింగ్స్ బ్యాంక్ ఖాతాలు పోస్టాఫీసుల్లో ఓపెన్ చేయోచ్చు.