Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ బ్యూరో
దళిత బహుజన చైతన్యానికి ఆద్యుడు, తెలంగాణ తేజోమూర్తి మాదరి భాగ్యరెడ్డి వర్మ అని తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మెన్ జూలూరు గౌరీశంకర్ అన్నారు. దళితుల్లో చైతన్యానికి చదువును ఆయుధంగా మలిచారని చెప్పారు. శనివారం తెలంగాణ సాహిత్య అకాడమీ కార్యాలయంలో భాగ్యరెడ్డి వర్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ భాగ్యరెడ్డి వర్మ, ఫూలే, అంబేద్కర్ల స్ఫూర్తితో రాష్ట్రంలో పరిపాలన సాగుతున్నదని తెలిపారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాల పిల్లల కోసం వెయ్యికి పైగా గురుకులాలను నెలకొల్పారన్నారు. తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యులు సీహెచ్ ఉపేంద్ర మాట్లాడుతూ విద్య ద్వారా దళిత బహుజన వర్గాల్లో చైతన్యం తెచ్చేందుకు గురుకులాలు సామాజిక మార్పుకు నమూనాగా నిలుస్తాయన్నారు. కార్యక్రమంలో ఉస్మానియా విశ్వవిద్యాలయం దళిత స్టడీ సెంటర్ డైరెక్టర్ ప్రొఫెసర్ కొండా నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.