Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పాఠశాలల్లో ఘనంగా నిర్వహించండి
నవతెలంగాణ-హైదరాబాద్బ్యూరో
అంతర్జాతీయ మాతభాషా దినోత్సవాన్ని ఈనెల 21న రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించాలని అధికార భాషా సంఘం ఆదేశించింది. ఆ మేరకు విద్యాశాఖాధికారులకు ఉత్తర్వులు జారీ చేసింది. పాఠశాలల్లో వ్యాసరచన, వక్తృత్వం, పద్య పఠనం, పరాయి మాట రాకుండా రెండు నిముషాలు మాట్లాడటం వంటి పోటీలు-భాషా సంస్కృతులను ప్రతిబింబించే విధంగా కార్యక్రమాలు నిర్వహించాలని పేర్కొన్నారు. ఉదయం ప్రార్థన మాతభాషలోనే జరపుతూ, భాషా విశిష్టతను తెలపాలని చెప్పారు. ఆయా పాఠశాలల్లో జరిగిన కార్యక్రమాల వివరాలను సంబంధిత జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయానికి నివేదికను తెప్పించుకోవాలని తెలిపారు. పోటీల్లో విజేతలైన విద్యార్థులకు ప్రశంసా పత్రాలు ఇవ్వాలని చెప్పారు.