Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆదేశాలు జారీ చేసిన డీజీపీ
నవతెలంగాణ - ప్రత్యేక ప్రతినిధి
మెదక్ పోలీసుల చేతిలో గాయపడి గాంధీ ఆస్పత్రిలో మరణించిన ఖదీర్ అనే వ్యక్తి ఉదంతంపై ఐజీ చంద్రశేఖర్రెడ్డి స్వీయ పర్యవేక్షణలో విచారణకు రాష్ట్ర డీజీపీ అంజనీకుమార్ శనివారం ఆదేశాలు జారీ చేశారు. గతనెల 29న చోరీ ఆరోపణపై ఖదీర్ అనే వ్యక్తిని మెదక్ టౌన్ పోలీసులు అదుపులోకి తీసుకొని చిత్రహింసలకు గురి చేసి ఒదిలి పెట్టారనీ, దాంతో బాధితుడు గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ రెండ్రోజుల క్రితం మరణించినట్టు ఆరోపణలు వచ్చాయి. పోలీసులు పెట్టిన చిత్ర హింసల కారణంగానే తీవ్ర గాయాలపాలై అతను మరణిం చినట్టు మృతుడి కుటుంబ సభ్యులు ఆరోపించారు. దీనిపై స్పందించిన డీజీపీ ఈ ఘటనపై కామారెడ్డి జిల్లాకు చెందిన సీనియర్ పోలీసు అధికారి చేత విచారణ జరిపించాలని, ఈ విచారణను ఐజీ చంద్రశేఖర రెడ్డి స్వయంగా పర్యవేక్షించాలని డీజీపీ ఆదేశాలు జారీ చేశారు.