Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ప్రాథమిక పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు సంఘటితం కావాల్సిన తరుణం ఆసన్నమైందని టీఎస్పీటీఏ అధ్యక్షులు సయ్యద్ షౌకత్‌అలీ, పిట్ల రాజయ్య శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. పండితుల కోసం ఎన్నో త్యాగాలు చేశామనీ, వారు తమను శత్రువుల్లా చూడడం బాధాకరమని పేర్కొన్నారు. భాషాపండితులే అయినా స్కూల్ అసిస్టెంట్లతో సమానంగా గౌరవించామని వివరించారు.
గ్రేడ్-1 భాషాపండితుల పోస్టును బీఈడీ లేకున్నా స్కూల్ అసిస్టెంట్‌గా పేరు మార్చి సమాన హోదాకు అంగీకరించామని తెలిపారు. బీఈడీ అర్హత లేకున్నా ప్యానల్ గ్రేడ్ హెడ్మాస్టర్గా పదోన్నతి పొందడానికి తమ హక్కులను త్యాగం చేశామని పేర్కొన్నారు. ప్రాథమిక ఉపాధ్యాయులకు స్కూల్ అసిస్టెంట్ హిందీ, తెలుగు పదోన్నతులు పొందడానికి గతంలో మాదిరి జీవోలిస్తే జీర్ణించుకోవడం లేదని వివరించారు. పాఠశాల విద్యాశాఖలో ప్రాథమిక ఉపాధ్యాయుల సంఖ్య 63 వేలు, భాషాపండితుల సంఖ్య పది వేల వరకు ఉందని తెలిపారు. ఎవరు కావాలో తేల్చుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు.