Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రపంచ జనాభాకు ఆహారాన్నందించే శక్తి భారత్‌కే ఉంది
- నూతన పద్ధతిలో వ్యవసాయం సాగాలి :మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి
నవతెలంగాణ-తూప్రాన్ రూరల్ (మనోహరాబాద్)
వ్యవసాయం పరిశ్రమగా స్థిరపడాలని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం ముప్పిరెడ్డిపల్లి గ్రామ శివారులోని పారిశ్రామిక వాడలో ఏర్పాటైన అక్షయ అగ్రి పరిశ్రమలో తయారవుతున్న వ్యవసాయ యంత్రాలను మంత్రి నిరంజన్ రెడ్డి శనివారం పరిశీలించారు. యంత్రాల తయారీ విధానం, వాటి పనితీరును పరిశ్రమ ప్రతినిధులు మంత్రికి వివారించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. ప్రస్తుతం ప్రపంచంలో 800 కోట్ల జనాబా దాటిపోయిందన్నారు. ఆ జనాభాకు తగిన ఆహారపు అలవాట్లను తీర్చగలిగే శక్తి కేవలం భారతదేశానికి మాత్రమే ఉందన్నారు. ఇక్కడి భూమి వనరులు, వాతావరణ అనుకూల పరిస్థితులతో అన్నిరకాల పంటలు పండే అవకాశం ఉందన్నారు. ఇంత ఉన్నా మన దేశానికి పప్పు దినుసులు, నూనెలు దిగుమతి చేసుకునే దౌర్భాగ్య పరిస్థితి దాపురించిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎక్కువ ఉత్పత్తిని చేసుకునే విధంగా మన ఆలోచన మారాలన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అటవీ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మెన్ వంటేరు ప్రతాప్‌రెడ్డి, మైనింగ్ శాఖ ఏడీ జయరాజ్, డీఏవో ఆశాకుమారి, ఎంపీపీ పురం నవనీత రవిముదిరాజ్, వైస్ ఎంపీపీ యంజాల విఠల్‌రెడ్డి, సర్పంచ్ నరాల ప్రభావతి పెంటయ్య, పరిశ్రమ ప్రతినిధులు పాల్గొన్నారు.