Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
సినీ నటుడు నందమూరి తారకరత్న(40) మృతికి రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు సంతాపం తెలిపారు. ఆదివారం ఈమేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. తారకరత్న మరణం పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఏపీ సీఎం జగన్ కూడా సంతాపం తెలిపి కుటుంబసభ్యులకు సానుభూతి తెలిపారు. సంతాపం తెలిపిన వారిలో టీపీసీసీ అధ్యక్షులు ఎ.రేవంత్‌రెడ్డి, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజరుకుమార్, మంత్రులు హరీశ్‌రావు, తలసాని శ్రీనివాస్‌యాదవ్, పువ్వాడ అజరుకుమార్, తదితరులు ఉన్నారు.