Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాష్ట్ర మహిళా కమిషన్ సునీతా లక్ష్మారెడ్డి ఆదేశం
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రంగారెడ్డి జిల్లా పీరం చెరువు వద్ద దోపిడీ దొంగలు వివాహితను కిడ్నాప్ చేసి కారులో తిప్పుతూ లైంగిక దాడికి పాల్పడిన ఘటనపై రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ సునీతా లక్ష్మారెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో ఆవేదన వ్యక్తం చేశారు. ఈ దారుణానికి పాల్పడిన వారిని తక్షణమే పట్టుకుని కఠినంగా శిక్షించాలని సైబరాబాద్ సీపీ,కలెక్టర్‌ను ఆదేశించారు. వెంటనే సమగ్ర విచారణ జరిపి రాష్ట్ర మహిళా కమిషన్‌కు నివేదిక సమర్పించాలని ఆదేశించారు. మహిళలకు సమస్యలు వచ్చినప్పుడు వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్లో,పోలీస్ హెల్ప్ లైన్ నంబర్ 100, మహిళా హెల్ప్ లైన్ నంబర్ 181, తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ వాట్సప్ హెల్ప్ లైన్ నంబర్ 9490555533 కి పిర్యాదు చేయాలని సూచించారు. బాధితురాలికి మహిళా కమిషన్, ప్రభుత్వం అండగా ఉంటాయని ఆమె తెలిపారు.