Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : ఎస్ఆర్ఎం ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ (ఎస్ఆర్ఎంఐఎస్టీ) వైస్ చాన్స్లర్ ప్రొఫెసర్ డాక్టర్ సి. ముత్తమిళ్ చెల్వన్కు అత్యుత్తమ గౌరవం దక్కింది. నేషనల్ కాడెట్ కార్ప్స్కు అందజేసిన సేవలకు గాను గౌరవ కల్నల్ గుర్తింపు లభించింది. ఈనెల 18న జరిగిన పిప్పింగ్ వేడుకల్లో ఆయనకు ఈ సత్కారం చేశారు. ఎస్ఆర్ఎంఐఎస్టీలోని డాక్టర్ టీపీ గణేశన్ ఆడిటోరియంలో జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా వచ్చిన లెఫ్టినెంట్ జనరల్ ఎ. అరుణ్, వైఎస్ఎం ఎస్ఎం విఎస్ఎం, జనరల్ ఆఫీసర్ కమాండింగ్ ఆఫ్ సౌత్ ఇండియా సంయుక్తంగా ర్యాంకును, బ్యాడ్జిలను ప్రొఫెసర్ ముత్తమిళ్ చెల్వన్కు అందజేశారు. ఈ కార్యక్రమానికి గౌర అతిథిగా కమాండర్ అతుల్ కుమార్ రస్తోగి డిప్యూటీ డైరెక్టర్ జనరల్, ఎన్సీసీ డైరెక్టరేట్ పాల్గొన్నారు. ఈ గౌరవం తనకు దక్కినందుకు గర్వపడుతున్నానని ప్రొఫెసర్ ముత్తమిళ్ చెల్వన్ అన్నారు.