Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
జగిత్యాల జిల్లాలోని కొండగట్టు ఆంజనేయ స్వామి గుడి, పరిసర ప్రాంతాలను అభివద్ది చేయా లని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర రావు ఆదేశాల మేరకు రాష్ట్ర అటవీ సంరక్షణ ప్రధాన అధికారి (పీసీసీఎఫ్, హెచ్ఓఎఫ్ఎఫ్) ఆర్.ఎం. డోబ్రియాల్ సోమవారం కొండగట్టులో పర్యటించారు. ఆలయ అభివద్ది, పునర్నిర్మాణానికి రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్‌కుమార్ తన వంతుగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ తరపున కొండగట్టును ఆనుకుని ఉన్న కొడిమ్యాల అటవీ ప్రాంతాన్ని దత్తత తీసుకుంటామని ప్రకటించారు. దీనితో అధికారులు అక్కడ చేపట్టాల్సిన పనులను గుర్తించేందుకు పర్య టన జరిపారు. అటవీ ప్రాం తం చుట్టూ రక్షణ కంచె ఏర్పాటు, 5 కిలో మీటర్లు కాలినడక మార్గం (వాకింగ్ ట్రాక్) మట్టితో ఏర్పాటు చేయటం, వెయ్యి ఎకరాల్లో ఔషద, సుగంధ మొక్కల పెంపకం, దానికోసం నర్సరీల ఏర్పాటు, వాచ్ టవర్ నిర్మాణం, యాత్రీకుల విశ్రాంతి మందిరా లు తొలి దశలో చేపట్టాలని నిర్ణయించారు. పర్యటన లో శరవణన్, ముఖ్య అటవీ సంరక్షణాధి కారి, బాసర సర్కిల్, వెంకటేశ్వరావు, జగిత్యాల జిల్లా అటవీ అధికారి లత, రేంజ్ ఆఫీసర్ మౌనిక, డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ సాయిరాం పాల్గొన్నారు.