Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పీడీఎస్‌యూ
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో నాలుగేండ్లుగా పెండింగ్‌లో ఉన్న స్కాలర్షిప్, ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని పీడీఎస్‌యూ డిమాండ్ చేసింది. ఈ మేరకు ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు పెద్దింటి రామకృష్ణ, కార్యదర్శి నామాల ఆజాద్ సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రంలో స్కాలర్షిప్, ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై ఆధారపడి నిరుపేద విద్యార్థులు ఉన్నత చదువులు కొనసాగిస్తున్నారని తెలిపారు. రూ.4,529 కోట్ల బకాయిలను ప్రభుత్వం విడుదల చేయకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. పరీక్షల సమయం ఆసన్నమైందని వివరించారు. ఫీజులు చెల్లిస్తేనే హాల్‌టికెట్లు ఇస్తామంటూ ప్రయివేటు విద్యాసంస్థల యాజమాన్యాలు బెదిరిస్తున్నాయని తెలిపారు. దీంతో విద్యార్థులు భయాందోళనలకు గురవుతున్నారని పేర్కొన్నారు. పెండింగ్‌లో ఉన్న ఫీజు బకాయిలను వెంటనే విడుదల చేయాలని కోరారు. పెరిగిన ధరలు, ఖర్చులరీత్యా స్కాలర్షిప్, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను పెంచాలని డిమాండ్ చేశారు. లేకుంటే ఉద్యమాలను బలోపేతం చేస్తామని హెచ్చరించారు.