Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- క్షేత్ర స్థాయి తనిఖీలు చేయండి
- ద.మ. రైల్వే జీఎమ్ అరుణ్ కుమార్ జైన్
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
రైళ్లు, రైల్వే లైన్ల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలనీ, దానికోసం అధికారులు క్షేత్రస్థాయి తనిఖీలు తప్పనిసరిగా చేపట్టాలని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్‌కుమార్ జైన్ ఆదేశించారు. సోమవారంనాడాయన సికింద్రాబాద్‌లోని రైల్ నిలయంలో ''ఇంటెన్సివ్ సేఫ్టీ డ్రైవ్''పై సమీక్షా సమావేశం నిర్వహించారు. విజయవాడ, గుంతకల్, గుంటూరు, సికింద్రాబాద్, హైదరాబాద్, నాందేడ్‌లకు చెందిన డివిజనల్ రైల్వే మేనేజర్లు (డీఆర్ఎంలు) వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ లాబీలు, నిర్వహణ కేంద్రాలు, పని ప్రదేశాల్లో ఆకస్మిక క్షేత్ర తనిఖీలు చేపట్టాలని చెప్పారు. ప్రమాద హెచ్చరిక సిగల్ పాస్ చేయడం వంటి అవాంఛనీయ సంఘటనలను నివారించడానికి లోకో పైలట్లు, అసిస్టెంట్ లోకో పైలట్లతో సహా అన్ని భద్రతా విభాగాల సిబ్బందికి నిరంతర కౌన్సెలింగ్ నిర్వహించాలని ఆదేశించారు. అనంతరం 'అమత్ భారత్ స్టేషన్ల' ప్రాజెక్టు స్థితిగతులపైనా సమీక్షించారు. ఆధునీకరణ కోసం ఎంపిక చేసిన రైల్వే స్టేషన్లలో జరుగుతున్న పనుల పురోగతిని అధికారులు జనరల్ మేనేజర్‌కు వివరించారు.