Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అంబేద్కర్ వర్సిటీ వీసీ సీతారామారావు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ఒకవైపు సాంకేతిక పరిజ్ఞానం పరుగులు పెడుతుంటే మరోవైపు మూస పద్ధతుల్లో విద్యాబోధన సరైంది కాదని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం ఉపకులపతి (వీసీ) కె సీతారామారావు అన్నారు. సెంటర్ ఫర్ స్టాఫ్ ట్రైనింగ్ అండ్ డెవలప్మెంట్ (సీఎస్టీడీ) ఆధ్వర్యంలో అధ్యాపకులు, పరిశోధకులకు రెండురోజులపాటు నిర్వహించే శిక్షణా కార్యక్రమం సోమవారం ప్రారంభమైంది. 'ఔట్కం బేస్డ్ ఎడ్యుకేషన్ టీచింగ్ లెర్నింగ్'అనే అంశంపై శిక్షణ ఇస్తారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తక్కువ సమయంలో అధునాతన పద్ధతుల్లో విద్యార్థికి సమగ్రంగా అర్థమయ్యేలా పాఠాలు ఎలా బోధించాలో ఈ శిక్షణలో చెప్తారని అన్నారు. పరిశోధన అంశాలను చాట్ జీపీటీలాంటివి మరింత ప్రభావితం చూపుతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో గౌరవ అతిథులుగా వర్సిటీ ఇంచార్జీ అకడమిక్ డైరెక్టర్ సుధారాణి, రిజిస్ట్రార్ ఎవిఎన్ రెడ్డి, సీఎస్టీడీ డైరెక్టర్ ఐ ఆనంద్ పాల్గొన్నారు.