Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-శంషాబాద్
హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో హైదరాబాద్-చెన్నై విమానంలో బాంబు పెట్టామంటూ ఓ దుండగుడు సోమవారం ఎయిర్‌పోర్టుకు ఫోన్ చేయడంతో ఒక్కసారిగా కలకలం రేగింది. అప్రమత్తమైన ఎయిర్‌పోర్టు అధికారులు బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్‌తో తనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో ఎలాంటి అనుమానాస్పద వస్తువును గుర్తించలేదని అధికారులు తెలిపారు. బెదిరింపు కాల్ చేసిన వ్యక్తి ఎయిర్‌పోర్టులోనే ఉన్నట్టు ఇంటెలిజెన్స్ అధికారులు గుర్తించారు. చెన్నైలో సీనియర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న అజ్మీరా భద్రయ్యగా గుర్తించారు. విమానాశ్రయానికి ఆయన ఆలస్యంగా రావడంతో ఆయన్ను ఎయిర్‌లైన్స్ సిబ్బంది లోపలికి అనుమతించలేదు. దాంతో ఈ బెదిరింపు కాల్ చేసినట్టు పోలీసులు నిర్ధారించారు. ఆయనను అదుపులోకి తీసుకుని ఆర్జీఐఏ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.