Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో వెనుకబడిన వర్గాల సంక్షేమం కొనసాగుతున్నదనీ, విద్యాపరంగా, సామాజికంగా, ఆర్థికంగా అన్ని రంగాల్లో బీసీలకు మేలు జరుగుతున్నదని రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. సోమవారం హైదరాబాద్లో తన నివాసంలో బీసీ సంక్షేమ సంఘం నాయకులతో ఆయన పలు విషయాలపై చర్చించారు. ఈ సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర నూతన అధ్యక్షుడిగా నూతనంగా ఎన్నికైన బైరి రవికృష్ణను సన్మానించారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్, ఉపాధ్యక్షులు దాడి మల్లయ్య యాదవ్, గోపాల్ గౌడ్, విక్రమ్ తదితరులు పాల్గొన్నారు
ప్రతిష్టాత్మకంగా బీసీ ఆత్మగౌరవ భవనాల నిర్మాణం : సమీక్షలో మంత్రి గంగుల
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న బీసీ ఆత్మగౌరవ భవనాల నిర్మాణ ప్రక్రియ వేగంగా కొనసాగుతున్నదని మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. వాటి నిర్మానాలకు సంబంధించిన అంశాలపై సోమవారం హైదరాబాద్లోని తన అధికారిక నివాసంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు.ఈ సమావేశంలో బీసీ సంక్షేమ శాఖ ఉన్నతాధికారులు, తెలంగాణ స్టేట్ వెల్ఫేర్ ఇన్ప్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఉన్నతాధికారులు, హెచ్ఎండీఏ అధికారులు పాల్గొన్నారు. నెలాఖరు కల్లా అన్ని భవనాలకు టెండర్లు పూర్తి చేయాలనీ, మార్చిలో నిర్మాణ పనులు ప్రారంభమయ్యేటట్లు చర్యలు తీసుకోవాలని మంత్రి అధికారులను అదేశించారు.