Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కాళోజీ వర్సిటీకి హైకోర్టు ఆదేశం
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
హాజరు శాతం తక్కువగా ఉన్న నార్కెట్పల్లికి చెందిన విద్యార్థిని అరుణను ఎంబీబీఎస్ పరీక్షకు అనుమతించాలంటూ కాళోజీ వర్సిటీనిత హైకోర్టు ఆదేశించింది. ప్రధాన న్యాయమూర్తి ఉజ్జల్ భూయాన్, జస్టిస్ తుకారాంజీతో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఆదేశాలిచ్చింది. మంగళవారం నుంచి జరగబోయే పరీక్షలకు ఆమెను అనుమతించాలని కామినేని ఆస్పత్రికి కూడా ఆదేశాలు జారీ చేసింది. విచారణను వచ్చే నెలకు వాయిదా వేసింది.