Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జరిగిన అమరుల ఆత్మబలిదానాలను వధాగా పోనివ్వమనీ, సామాజిక తెలంగాణ సాధించి తీరతామని బీసీ రాజ్యాధికార సమితి వ్యవస్థాపక అధ్యక్షులు దాసు సురేష్ అన్నారు. సోమవారం గన్‌పార్క్ వద్ద జరిగిన కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర సాధన సమయంలో ఆత్మబలిదానం చేసుకున్న సిరిపురం యాదయ్యకు నివాళులు అర్పించారు. త్యాగాలతో పోరాడి సాధించుకున్న స్వరాష్ట్రంలో తెలంగాణ ద్రోహులే అధికారంలో కొనసాగడం చూస్తుంటే...దీనికోసమా తాము తెలంగాణ కోసం బరిగీసి కొట్లాడిందని ఆత్మ విమర్శ చేసుకునే పరిస్థితి నెలకొందని మాజీ ఆర్టీసీ జేఏసీ చైర్మెన్, బీసీ రాజ్యాధికార సమితి కోర్ కమిటీ సభ్యులు దొంత ఆనందం ఆవేదన వ్యక్తం చేశారు. బీసీ రాజ్యాధికార సమితి ఆధ్వర్యంలో ''రాజ్యాధికార పోరుబాట'' కార్యక్రమం నిర్వహించి, జిల్లాల్లో పర్యటిస్తామని చెప్పారు. కార్యక్రమంలో రాష్ట్ర కోర్ కమిటీ సభ్యులు చాపర్తి కుమార్ గాడ్గే, రాష్ట్ర నాయకులు మంద వెంకటస్వామీ హైదరాబాద్ పట్టణ నాయకులు సుజిత్ రావణ్, అనిల్, శారద , రేణుక , మోహన్ తదితరులు పాల్గొన్నారు.