Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఎం కేసీఆర్కు జూలకంటి లేఖ
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ఆశావర్కర్లకు కనీసం వేతనం నెలకు రూ.26 వేలు ఇవ్వాలనీ, ప్రసూతి సెలవులు, పీఎఫ్, ఈఎస్ఐ, పెన్షన్, ఉద్యోగ భద్రత కల్పించాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు సోమవారం ఆయన సీఎం కేసీఆర్కు లేఖ రాశారు. వారికి కనీస వేతనం ఇచ్చేంత వరకు ఆంధ్రప్రదేశ్ మాదిరిగా ఫిక్స్ డ్ వేతనం రూ.10 వేలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. గతంలో 106 రోజుల సమ్మె సందర్భంగా ఫిక్స్ డ్ వేతనం రూ.6 వేలు చెల్లిస్తామన్న ముఖ్యమంత్రి హామీ అమలు చేయడం లేదని గుర్తుచేశారు. పాత పద్దతిలోనే పారితోషికాలు చెల్లిస్తున్నారని తెలిపారు.సమయపాలన లేకుం డా పని చేస్తున్న ఆశావర్కర్లపై పని భారం రెట్టింపయిందని జూలకంటి ఈ సందర్భంగా ఆవేదన వ్యక్తం చేశారు. వారికి 2021 జులై నుంచి డిసెంబర్ ఆరు వరకు ఆరు మాసాల పీఆర్సీ బకాయిలతో పాటు కేంద్ర ప్రభుత్వం చెల్లించిన కరోనా రిస్క్ అలవెన్సులు నెలకు రూ.వెయ్యి చొప్పున 16 నెలల బకాయిలు కూడా ఇవ్వాల్సి ఉందన తెలిపారు. 2022 డిసెంబర్ ఆరు నుంచి లెప్రసీ సర్వే, 2023 జనవరి 18 నుంచి కంటి వెలుగు రూపంలో అదనపు పనులు నిర్వహిం చినా...డబ్బులు చెల్లించకపోవడంతో ఆశాలు తీవ్రంగా నష్టపోతున్నారని పేర్కొ న్నారు. పెరిగిన ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచకపోవడంతో వారి కుటుంబాలు గడవక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఆశాల విభాగంలో ని ఖాళీ పోస్టులను భర్తీ చేయాలనీ, ఇన్చార్జీ అలవెన్సులను ఇప్పించా లని కోరారు. 32 రకాల రిజిస్టర్లు ప్రింట్ చేసి సరఫరా చేయాలనీ, ఇప్పటికే వాటి కోసం ఆశాలు పెట్టిన ఖర్చులు ఇప్పించాలని విజ్ఞప్తి చేశారు., ఐదేండ్ల పెండింగ్ యూనిఫారం ఇవ్వాలనీ, జిల్లా ఆస్పత్రుల్లో రెస్టు రూములు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. జాబ్ చార్ట్ విడుదల చేసి, పని భారం తగ్గించాలనీ, టీబీ స్పూటమ్ పరీక్ష డబ్బాలను ఆశాలతో మోపించే పనిని రద్దు చేయాలనీ, అధికారుల వేధింపులు అరికట్టాలని జూలకంటి ఆ లేఖలో సీఎంను కోరారు.