Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టీఎస్పీఈజేఏసీ ఉద్యమ కార్యాచరణ వెల్లడి
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
విద్యుత్ ఉద్యోగులకు తక్షణం వేతన సవరణ చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ స్టేట్ పవర్ ఎంప్లాయీస్ జాయింట్ యాక్షన్ కమిటీ (టీఎస్పీఈజేఏసీ) భవిష్యత్ ఉద్యమ కార్యాచరణ ప్రకటించింది. ఈనెల 21, 22 తేదీల్లో సర్కిల్ స్థాయి సమావేశాలు, 24, 25, 28 తేదీల్లో నల్లబ్యాడ్జీలతో నిరసన కార్యక్రమాలు చేపట్టాలని జేఏసీ సమావేశంలో తీర్మానం చేసినట్టు చైర్మెన్ సాయిబాబు, కన్వీనర్ రత్నాకర్, కో చైర్మెన్ ఎన్ శ్రీధర్, కో కన్వీనర్ బీసీ రెడ్డి, వైస్ చైర్మెన్లు గోవర్థన్, సదానందం, వజీర్, కరుణాకర్‌రెడ్డి, రాంజీ, తులసి నాగరాణి, అశోక్‌రెడ్డి, వేణు, సత్యనారాయణ తదితరులు తెలిపారు. మార్చి 14న కేటీపీఎస్ ఎదుట, మార్చి 17న వరంగల్, మార్చి 21న హైదరాబాద్‌లో నిరసన సభలు నిర్వహించాలని నిర్ణయించామన్నారు. మార్చి 24న హైదరాబాద్ విద్యుత్ సౌధలో మహాధర్నా నిర్వహిస్తామన్నారు. అప్పటికీ యాజమాన్యం స్పందించకుంటే మార్చి 24న అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి, భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామన్నారు.