Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జీనోమ్ వ్యాలీలో యూనిట్ విస్తరణ..
హైదరాబాద్ : ప్రముఖ ఔషద ఉత్పత్తుల కంపెనీ గ్లాండ్ ఫార్మా రాష్ట్రంలో మరో రూ.400 కోట్ల పెట్టుబడులను ప్రకటించింది. ఈ వ్యయంతో జీనోమ్ వ్యాలీలో తన కార్యకలాపాలను మరింత విస్తరించనున్నట్లు పేర్కొంది. ''గ్లాండ్ ఫార్మా కొత్తగా రూ.400 కోట్ల పెట్టుబడులతో.. మరో 500 మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయి. జీనోమ్ వ్యాలీలో గ్లాండ్ ఫార్మా తన కార్యకలాపాలను మరింత విస్తరిస్తున్నదని ప్రకటించడం చాలా ఆనందంగా ఉంది.'' '' అని రాష్ట్ర ఐట, పరిశ్రమల శాఖ మంత్రి కెటిఆర్ ట్విట్టర్లో తెలిపారు. కొత్తగా రూ.400 కోట్ల పెట్టుబడితో బయాలజికల్స్ లాంటి అడ్వాన్స్ ఏరియాల్లో 500 ఉద్యోగాల సృష్టి జరుగనుందన్నారు. తెలంగాణ రాష్ట్ర లైఫ్ సైన్సెస్, జీనోమ్ వ్యాలీల శక్తి నిత్యం బలోపేతమవుతోందని మంత్రి కెటిఆర్ పేర్కొన్నారు. 2022లో ఈ కంపెనీ ఇక్కడ రూ.300 కోట్ల పెట్టుబడులు పెట్టింది. ఇప్పటికే 200 మంది ఉద్యోగులు పని చేస్తున్నారు.