Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దళిత రైతుల నిరసన
నవతెలంగాణ-బోధన్
ప్రభుత్వ భూముల్లో ఏండ్లుగా సాగుచేసుకుంటున్న తమకు పట్టాలు ఇవ్వాలని దళిత రైతులు డిమాండ్ చేశారు. నిజామాబాద్ జిల్లా సాలూర మండలం మంధర్న గ్రామానికి చెందిన సుమారు 50 దళిత కుటుంబాలు సోమవారం బోధన్ ఆర్డీవో కార్యాలయానికి తరలివచ్చి బైటాయించి ఆందోళన చేపట్టాయి. ఈ సందర్భంగా హూన్స సొసైటీ చైర్మెన్, కిసాన్ ఖండ్ మండల అధ్యక్షులు మంధర్న రవి మాట్లాడుతూ.. మంధర్న గ్రామంలోని నిరుపేద దళిత, బీసీ కుటుంబాల రైతులు 25-30 ఏండ్లుగా ప్రభుత్వ భూమిని సాగు చేసుకుంటూ ఉపాధి పొందుతున్నారని తెలిపారు. ఈ భూమిలో కొందరు బోర్లు వేసుకుని సాగు చేసుకుంటున్నారని అన్నారు. గతంలో అధికారులు సర్వేచేసి ఎలాంటి ప్రకటన చేయలేదని తెలిపారు. భూమి పట్టాలు లేకపోవడంతో వారికి ప్రభుత్వం అందించే రైతుబీమా, రైతుబంధు పథకాలు అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ఆ భూములకు తక్షణమే పట్టాలు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం ఆర్డీఓ రాజేశ్వర్‌కు వినతి పత్రం అందించారు. నిరసనలో మహిళ రైతులు, యువకులు పాల్గొన్నారు.