Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
సిద్దిపేట జిల్లాలో చేపట్టాల్సిన రోడ్ల భద్రతా చర్యలపై రాష్ట్ర వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి టి హరీశ్‌రావు అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. హైదరాబాద్‌లో ఈ భేటికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎ.శాంతికుమారి, ఆర్అండ్బీ కార్యదర్శి శ్రీనివాస్‌రాజు, ఆరోగ్యశాఖ కార్యదర్శి సయ్యద్ అలీ ముర్తుజ రిజ్వీ, రవాణాశాఖ కమిషనర్ బుద్ధప్రకాశ్ జ్యోతి, పోలీసు, ఆర్అండ్బీ, రవాణా, ఆరోగ్యశాఖ అధికారులు హాజరయ్యారు. సిద్దిపేట జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదాలపై సిద్దిపేట సీపీ శ్వేత పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. మరణాలను తగ్గించడంలో గణనీయంగా సహాయపడిన తమిళనాడు నమూనాను అధ్యయనం చేయాలని మంత్రి హరీశ్‌రావు ఆరోగ్యశాఖ అధికారులను ఆదేశించారు. అలాగే సిద్దిపేట-హైదరాబాద్ రహదారిపై ప్రమాదాలు జరిగే ప్రాంతాల్లో సూచికలు, స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రభుత్వ, ప్రయివేటు రంగంలోని ఆసుపత్రులను ట్రామా కేర్ సెంటర్లుగా గుర్తించి వాటిని పోర్టల్‌లో అప్లోడ్ చేయాలని అధికారులను కోరారు. గజ్వేల్ ఔటర్ రింగ్ రోడ్డులో సర్వీస్ రోడ్లను అభివద్ధి చేయాలనీ, ఐలాండ్స్‌లో లైట్లు వేసేలా చర్యలు తీసుకోవాలని ఆర్అండ్బీ అధికారులను సూచించారు. సిద్ధిపేటలో గుర్తించిన వివిధ బ్లాక్స్పాట్లను, ఆయా ప్రాంతాల్లో ప్రమాదాల నివారణకు తీసుకుంటున్న చర్యలను అధికారులు మంత్రికి వివరించారు. రహదారి భద్రతా కమిటీపై రాష్ట్ర స్థాయి కమిటీని ఏర్పాటు చేశారు. ప్రమాదాల నివారణకు కార్యాచరణ ప్రణాళికను రూపొందించడానికి జిల్లా స్థాయిలో కూడా ఇలాంటి కమిటీలు పనిచేస్తాయని ప్రకటించారు.