Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అంతిమయాత్రలో పాల్గొన్న మంత్రులు
నవతెలంగాణ-కంటోన్మెంట్
హైదరాబాద్లోని కంటో న్మెంట్ ఎమ్మెల్యే జి.సాయన్నకు కన్నీటి వీడ్కోలు పలికారు. అంతిమ సంస్కారాలు సోమ వారం మారేడ్పల్లి హిందూ శ్మశానవాటికలో నిర్వహించారు. మధ్యాహ్నం మూడు గంటలకు కార్ఖానా క్యాంపు కార్యాల యం నుంచి బయలుదేరిన అంతిమయాత్ర శ్మశానవాటికకు చేరుకుంది. అయితే, అధికారిక ఏర్పాట్లు చేయకపోవడంతో అభిమానులు, కార్యకర్తలు సాయన్న భౌతికకాయాన్ని చుట్టుముట్టి ఆందోళనకు దిగారు. సీనియర్ ఎమ్మెల్యేకి లాంచనప్రాయంగా, ప్రభుత్వపరంగా చేయాల్సిన ఏర్పాట్లు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి శ్రీనివాస్ యాదవ్ వారికి నచ్చజెప్పినప్పటికీ మధ్యాహ్నం నుంచి కార్యకర్తలు, అభిమానులు శ్మశానవాటికలోనే ఆందోళనకు దిగారు. అధికార లాంచనాలతో అంత్యక్రియలు నిర్వహిం చాలని డిమాండ్ చేశారు. ఆలస్యం అవుతుండటంతో సాయన్న కుటుంబీకులు నచ్చజెప్పి అంత్యక్రియలు జరిగేలా చూడాలనడంతో శాంతించారు. దీంతో రాత్రి 7 గంటల 25 నిమి షాలకు అంత్యక్రియలు పూర్తి చేశారు. సాయన్న అల్లుడు అంతిమ సంస్కారాలు చేశారు. కాగా, సోమవారం ఉదయం నుంచి కార్యకర్తలు, అభిమానుల సందర్శనార్థం కార్ఖానాలోని క్యాంపు కార్యాలయంలో భౌతికకాయాన్ని ఉంచారు. మంత్రి కేటీఆర్, డిప్యూటీ స్పీకర్ పద్మారావు, మంత్రులు మహమ్మద్ అలీ, శ్రీనివాస్ యాదవ్, బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్, పలువురు కాంగ్రెస్ ప్రముఖులు సాయన్న భౌతికకాయాన్ని సందర్శించి పుష్పగుచ్ఛాలు పెట్టి నివాళి అర్పించారు. కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జక్కుల మహేశ్వర్ రెడ్డి, మాజీ సభ్యులు నళిని వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. కార్యకర్తలు, అభిమానులు పెద్దఎత్తున తరలివచ్చారు.