Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: ఆరె కులస్తులు రాజకీయంగా ఆర్థికంగా అన్ని రంగాలలో రాణించాలని అధ్యక్షులుగా చెట్టిపల్లి శివాజీ అన్నారు. అంబర్‌పేట త్రిశూల్ కన్వెన్షన్ హాలులో జరిగిన కార్యవర్గ సమావేశంలో సోమవారం నూతన కమిటీని ఎన్నుకున్నారు. అధ్యక్షులుగా చెట్టిపల్లి శివాజీ, గౌరవ అధ్యక్షులు నాగూర్ల వెంకన్న, స్టీరింగ్ కమిటీ చైర్మెన్‌గా దిగంబర్ రావు, క్రమశిక్షణ కమిటీ చైర్మెన్‌గా ఎం.రాంబాబు, ఉద్యమ కమిటీ చైర్మెన్‌గా సోమిడి అంజన్ రావు, ఆరె కుల రైతు సంఘ అధ్యక్షులుగా మోర్తాల చందర్ రావుతో పాటు వివిధ కార్యవర్గ కమిటీని ఎన్నుకున్నారు. ఈ కమిటీ పలు తీర్మానాలు చేసి ఆమోదించింది. ఉప్పల్ భగాయాల్లో ఆరెకుల సంఘానికి ఒక ఎకరం స్థలం, రూ.కోటి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినందుకు సీఎం కేసీఆర్‌కు ధన్యవాదాలు తెలిపారు. అలాగే భవన నిర్మాణానికి మరో నాలుగు కోట్లు నిధుల కోసం విజ్ఞప్తి చేయాలని నిర్ణయించారు.
ఈ సమావేశంలో సంఘం నాయకులు రామ నర్సింహాయ్య, కోల కష్ణస్వామి, నర్సింగ్ రావు, శ్రీనివాస్, దామోదర్ తదితరులు పాల్గొన్నారు.