Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టీజీఎస్ రాష్ట్ర మూడో మహాసభల పోస్టర్ అవిష్కరణ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అను సరిస్తున్న గిరిజన వ్యతిరేక విధానా లపై పోరాటాలకు శ్రీకారం చుట్టాలని మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగా రెడ్డి పిలుపునిచ్చారు. తెలంగాణ గిరిజన సంఘం(టీజీఎస్) రాష్ట్ర మూడో మహాసభల సందర్భంగా ముద్రించిన పోస్టర్ను సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎం ధర్మానాయక్, ఆర్ శ్రీరాం నాయక్తో కలి సి సోమవారం హైదరాబాద్లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఆ యన అవిష్కరించారు. మార్చి ఒకటో తేదీ నుంచి మూడో తేదీ వరకు మిర్యాల గూడలో మహాసభలు జరుగుతున్నాయని తెలిపారు. మార్చి ఒకటిన వేలాది మందితో మహాప్రధర్శన, బహిరంగ సభ నిర్వహించనున్నట్టు తెలిపారు. ముఖ్య అతిథులుగా మాజీ ఎంపీ, ఆదివాసి అధికార్ రాష్ట్రీయ మంచ్ జాతీయ నాయకులు బృందాకరత్, ఆదివాసీ అధికార్ రాష్ట్రీయ మంచ్ చైర్మెన్ డాక్టర్ మిడియం బాబురావు, మాజీ ఎంపీ తమ్మినేని వీరభద్రం, మాజీ ఎమ్మెల్సీ చెరుపల్లి సీతారాము లు పాల్గొంటున్నారని తెలిపారు.