Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మార్చి నుంచి అందుబాటులోకి...
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
ప్రయాణికులకు మరింత సౌకర్యవంతమైన సేవల్ని అందించేలా తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) తొలిసారిగా ఏసీ స్లీపర్ బస్సుల్ని ప్రవేశపెడుతున్నది. ఈ ఏడాది మార్చి నుంచి ప్రయాణీకులకు అందుబాటులోకి రానున్నాయి. తొలి విడతగా 16 ఏసీ స్లీపర్ బస్సుల్ని ప్రవేశపెడుతున్నారు. సుదూర ప్రాం తాలకు వెళ్లే రూట్లలో ఈ బస్సుల్ని టీఎస్ఆర్టీసీ నడుపనుంది. కర్ణాటక లోని బెంగళూరు, హుబ్లీ, ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నం, తిరుపతి, తమిళనాడులోని చెన్నై మార్గాల్లో ఈ బస్సులు నడుస్తాయి. ఈ బస్సులకు 'లహరి' గా నామకరణం చేశారు. సోమవారం హైదరాబాద్‌లోని బస్ భవన్ ప్రాంగణంలో కొత్త ప్రోటో (నమూనా) ఏసీ స్లీపర్ బస్సును టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ పరిశీలించారు. బస్సులోని సౌకర్యాల ను అడిగి తెలుసుకున్నారు. ఈ బస్సు లకు ప్రజల నుంచి మంచి ఆదరణ లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఇవీ ప్రత్యేకతలు...
ఏసీ స్లీపర్ 'లహరి' బస్సులు 12 మీటర్ల పొడవు ఉంటాయి. లోయర్ 15, అప్పర్ 15తో మొత్తం 30 బెర్తుల సామర్థ్యం ఉంటుంది. బెర్త్‌ల వద్ద వాటర్ బాటిల్ పెట్టుకునే సదుపా యంతో పాటు మొబైల్ చార్జింగ్ సౌకర్యం ఉంటుంది. ప్రతి బెర్త్ వద్ద రీడింగ్ ల్యాంప్‌లు ఏర్పాటు చేశారు. వెహికిల్ ట్రాకింగ్ సిస్టం, ప్యానిక్ బటన్ సదుపాయం కల్పించి, వాటిని టీఎస్ఆర్టీసీ కంట్రోల్ రూమ్‌కు అను సంధానం చేస్తారు. వైఫై సదుపాయం తో పాటు బస్సు క్యాబిన్లో, లోపల రెండు సీసీటీవీ కెమెరాలు ఉంటాయి. బస్సు రివర్స్ చేసేందుకు వీలుగా రివర్స్ పార్కింగ్ అసిస్టెన్స్ కెమెరా కూడా ఉంటుంది. బస్సుకు ముందు, వెనుక ఎల్ఈడీ బోర్డుల్లో గమ్యస్థానాల వివరాలు డిస్ప్లే చేస్తారు. అగ్నిప్రమా దాలను ముందుగా గుర్తించి నివారిం చేందుకు బస్సుల్లో ఫైర్ డిటెక్షన్ సప్రెషన్ సిస్టం(ఎఫ్డీఎస్ఎస్) ఏర్పా టు చేశారు. అలాగే పబ్లిక్ అడ్రస్ సిస్టం కూడా ఈ బస్సుల్లో ఉంటుంది. నమూనా బస్సును పరిశీలించిన వారిలో టీఎస్ఆర్టీసీ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ (సీవోవో) డాక్టర్ వీ రవిందర్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (ఆపరేషన్స్) పీవీ మునిశేఖర్, చీఫ్ పర్సనల్ మేనేజర్ (సీపీఎం) కష్ణకాంత్, చీఫ్ మెకానికల్ ఇంజనీర్ (సీఎంఈ) రఘునాథరావు, చీఫ్ ట్రాఫిక్ మేనేజర్(సీటీఎం) జీవన్‌ప్రసాద్ ఉన్నారు.