Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రైతుల ఉసురు తీసుకుంటున్న ప్రధాని
- విద్యుత్‌శాఖ మంత్రి గుంటకండ్లజగదీశ్రెడ్డి
నవతెలంగాణ-నల్లగొండ
సీఎం కేసీఆర్ సారధ్యంలో బీఆర్ఎస్ ఆవిర్భావంతో ప్రధానమంత్రి మోడీకి భయం పట్టుకుందని విద్యుత్‌శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. నల్లగొండ జిల్లా కేంద్రంలోని జేడీఏ కార్యాలయంలో సోమవారం రైతుబంధు సమితి జిల్లా కో ఆర్డినేటర్‌గా శ్రీనివాస్‌రెడ్డి ప్రమాణ స్వీకార మహోత్సవంలో మంత్రి పాల్గొన్నారు. గుజరాత్లో వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టి మోడీ రైతుల ఉసురు తీసుకుంటున్నారని విమర్శించారు. 2014కు ముందు తెలంగాణలో వ్యవసాయ రంగం అగమ్యగోచరంగా ఉందన్నారు. ఇప్పుడు రైతులకు 24 గంటల ఉచిత కరంట్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని చెప్పారు. డబుల్ ఇంజిన్ సర్కార్ అంటున్న ప్రధాని మోడీ సొంత రాష్ట్రం గుజరాత్లో రైతులకు ఇప్పటికీ 7 గంటలకు మించి కరెంట్ ఇవ్వడం లేదని విమర్శించారు అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి కేసీఆర్ బీజేపీ ద్వంద్వ విధానాలను ఎండగట్టారని, బీజేపీ నాయకులు తేలు కుట్టిన దొంగల్లా తప్పించుకు తిరుగుతున్నారని అన్నారు. కేసీఆర్‌ను నిలువరించడమే మోడీ పనిగా పెట్టుకున్నారని, గుజరాత్లో అన్నదాతలు కేసీఆర్ గురించి గొప్పగా చర్చించుకుంటున్నారని చెప్పారు. దేశంలో మోడీని ఎక్కడికక్కడ అన్నదాతలు నిలదీస్తున్నారని, తెలంగాణలో కరెంట్ కోతలు తెచ్చేలా మోడీ గ్యాంగ్ కుట్రలు చేస్తోందని ఆరోపించారు. ఇప్పటికైనా ప్రజల్లో చైతన్యం వచ్చి బీజేపీ జెండాలను, కేసీఆర్‌ని విమర్శించే వాళ్లను తరిమి కొట్టాలని కోరారు. రైతు సమన్వయ సమితి రాష్ట్ర అధ్యక్షులు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ.. పంజాబ్ ముఖ్యమంత్రి తెలంగాణ వ్యవసాయ విధానాన్ని, ఇరిగేషన్‌ను మెచ్చుకున్నారని తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అమలు చేస్తున్న రైతు సంక్షేమ కార్యక్రమాలతో వ్యవసాయం పండుగలా మారిందన్నారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్యయాదవ్, ఎమ్మెల్సీ మంకెన కోటిరెడ్డి, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు దేవరకొండ శాసనసభ్యులు రవీందర్ కుమార్‌నాయక్, ఎమ్మెల్యేలు కంచర్ల భూపాల్‌రెడ్డి, భాస్కరరావు, చిరుమర్తి లింగయ్య, గాదరి కిషోర్‌కుమార్, కార్పొరేషన్ చైర్మెన్లు తిప్పన విజయసింహారెడ్డి, దూదిమెట్ల బాల రాజుయాదవ్, జిల్లా గ్రంథాలయ చైర్మెన్ రేగట్టే మల్లికార్జున్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.