Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గ్రామపంచాయతీ కార్మికుల యూనియన్ రాష్ట్ర గౌరవ అధ్యక్షులు పాలడుగు భాస్కర్
నవతెలంగాణ - బీబీనగర్
గ్రామపంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కారం అయ్యే వరకు ఉద్యమం ఆగదని గ్రామపంచాయతీ కార్మికుల యూనియన్ రాష్ట్ర గౌరవ అధ్యక్షులు పాలడుగు భాస్కర్ అన్నారు. జీపీ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ఫిబ్రవరి 12న పాలకుర్తి నుంచి ప్రారంభమైన పాదయాత్ర సోమవారం యాదాద్రిభువనగిరి జిల్లా బీబీనగర్ మండల కేంద్రంలోపాటు రహింఖాన్గూడ, రాఘవాపురం, వెంకీర్యాల, మక్త అనంతరం, గ్రామాల మీదుగా పాదయాత్ర కొనసాగింది. వెంకిర్యాల గ్రామంలో ఏర్పాటు చేసిన సభలో భాస్కర్ మాట్లాడారు. పాదయాత్ర పూర్తయ్యే లోపు ప్రభుత్వం స్పందించి సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. లేనియెడల ఈ ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. గ్రామపంచాయతీ కార్మికులకు కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. పెరిగిన ధరలకు అనుకూలంగా వేతనాలు పెంచకుండా ప్రభుత్వం.. మరోవైపు జీవో నెంబర్ 51 తీసుకొచ్చి మల్టీ పర్పస్ విధానం అని ముద్దు పేరు పెట్టి అన్ని రకాల పనులు చేయాలని కార్మికులపై ఒత్తిడి చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. జీవో 51ని రద్దు చేయాలని, కరోనా సమయంలో ప్రాణాలకు తెగించి పనులు చేసిన గ్రామపంచాయతీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్ చేశారు. జీవితకాలం పనిచేసినా కనీస వేతనం రావడం లేదన్నారు. పింఛన్, పీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యం లేదని ఆవేదన వ్యక్తం చేశారు
కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలి
గ్రామపంచాయతీ కార్మికులకు కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని డీవైఎఫ్ఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆనగంటి వెంకటేష్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పాదయాత్రకు ఆయన సంఘీభావం తెలిపి మాట్లాడారు. మల్టీపర్పస్ పని విధానాన్ని రద్దు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రజాసంఘాల నాయకులు గ్యార పాండు, చాగంటి వెంకటయ్య, ఫైళ్ల గణపతిరెడ్డి, వినోద్‌కుమార్, మహేష్, పాలడుగు సుధాకర్, కల్లూరు మల్లేశం, పొట్ట యాదమ్మ తదితరులు పాల్గొన్నారు.
- డీవైఎఫ్ఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆనగంటి వెంకటేశ్