Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మత్స్యకార వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఏప్రిల్ 3న చలో ఢిల్లీ: కేరళ మత్స్య ఫెడ్ చైర్మెన్ టి.మనోహరన్ పిలుపు
నవ తెలంగాణ- ముషీరాబాద్
బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వం మత్స్యకారులకు తీవ్ర అన్యాయం చేసిందని, కేంద్ర ప్రభుత్వ విధానాల వల్ల మత్స్యకారులపై మరింత భారాలు పడుతున్నాయని కేరళ మత్స్య ఫెడ్ చైర్మెన్ టి.మనోహరన్ అన్నారు. మత్స్యకార వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఏప్రిల్ 3న చలో ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద జరిగే ధర్నాలో వేలాది మత్స్యకారులు పాల్గొని జయప్రదం చేయా లని పిలుపునిచ్చారు. హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సోమవారం నుంచి రెండ్రోజుల పాటు జరుగుతున్న మత్స్యకార జాతీయ కార్యవర్గ సమావేశాల సందర్భంగా సంఘం జాతీయ కార్య దర్శి లెల్లెల బాలకృష్ణ అధ్యక్షతన సదస్సు జరిగింది. ఈ మనోహరన్ మాట్లాడుతూ.. 8 ఏండ్లుగా కేంద్రం లోని బీజేపీ ప్రభుత్వం పెట్టుబడి దారీ వర్గాలకు రాయితీలు ఇస్తూ, మరోవైపు పేదలపై భారాలు మోపుతూ, ఉన్న సబ్సిడీలను ఎత్తేస్తూ ప్రజల మధ్య అంతరాలు పెంచుతున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. ఫలితంగా అణగారిన వర్గాలకు చెందిన మత్స్యకా రులు అనేక ఇబ్బందులు పడుతు న్నారని చెప్పారున. అఖిల భారత మత్స్య కారులు, మత్స్యకార్మిక సమాఖ్య ఆధ్వర్యంలో జరుగు తున్న కార్యవర్గ సమావేశాల్లో దేశవ్యాప్తంగా మత్స్య కారులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఉద్యమాలకు కార్యా చరణ రూపొందిస్తున్నామని, లక్షలాది మందితో సంతకాల సేకరణ, ఏప్రిల్ 3న వేలాది మంది మత్స్యకారులతో చలో ఢిల్లీ నిర్వహించ నున్నామని చెప్పారు. అఖిల భారత మత్స్యకారులు, మత్స్యకార్మిక సమాఖ్య అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు దేబ్ శేష్ బర్మన్ (కలకత్తా), పి.స్టాన్లీ (కేరళ), జాతీయ కోశాధికారి జి.మమత (న్యూ ఢిల్లీ) మాట్లాడుతూ.. దేశంలో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటువాద విచ్ఛిన్నకర చర్యలకు పాల్పడుతూ, సెంటిమెంట్లను రెచ్చ గొడుతూ ప్రజల మధ్య వైషమ్యాలు సృష్టిస్తోం దన్నారు. ప్రజా ఉద్యమాలను పక్కదోవ పట్టిస్తుందని, ప్రశ్నించే వారిపై కేసులు పెడుతున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. సంఘం జాతీయ కమిటీ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా బలమైన ఉద్యమాలు నిర్మిస్తున్నామని, మత్స్యకారులందరూ పెద్దసంఖ్యలో పాల్గొని జయ రప్రదం చేయాలని పిలుపునిచ్చారు. తెలంగాణ మత్స్యఫెడ్ మాజీ చైర్మెన్ చేతి ధర్మయ్య, తెలంగాణ ఫిషరీస్ సొసైటీ అధ్యక్షులు పిట్టల రవీందర్ మాట్లా డారు. తెలంగాణ మత్స్య కారులు, మత్స్యకార్మిక సం ఘం రాష్ట్ర అధ్యక్షులు గోరెంకల నర్సింహ్మ సదస్సులో తీర్మానాన్ని ప్రవేశ పెట్టగా, రాష్ట్ర ఉపాధ్య క్షులు ముఠా విజయ కుమార్, చెనమోని శంకర్, మురారి మోహన్, పగడాల నాగేశ్వరరావు, రాష్ట్ర కార్యదర్శులు కొప్పు పద్మ, గొడుగు వెంకట్, మునిగెల రమేష్, తేలు ఇస్తారి, అర్వపల్లి శ్రీరాములు నాయకత్వం వహించారు.
సదస్సులో పలు తీర్మానాలు చేశారు.. అవి
- కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 2023-24లో ప్రకటించిన బడ్జెట్లను సవరించి మత్స్యకారులకు రూ.5వేల కోట్లు నిధులు కేటాయించాలి.
- కరోనా నేపథ్యంలో 3 సంవత్సరాలుగా తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో వున్న మత్స్యకారులను ఆదుకోవడానికి ప్రతి మత్స్య సొసైటీకీ (ఎలాంటి షరతులు లేకుండా) రూ.10లక్షల ఆర్థిక సహకారం అందించాలి.
- మత్స్యశాఖ ద్వారా మత్స్య సొసైటీలకు ఉచితంగా పంపిణీ చేస్తున్న చేప/ రొయ్య పిల్లలను జలవనరులకు సరిపడేంత పంపిణీ చేయాలి. ఎలాంటి అవినీతికి తావులేకుండా క్వాలిటీ / క్వాంటిటీగా పంపిణీ చేయాలి.
- మత్స్యశాఖ పరిధిలోని శిథిలావస్థలో వుండి కబ్జాలకు గురవుతున్న ప్రభుత్వ చేప పిల్లల విత్తన క్షేత్రాలకు ప్రత్యేక నిధులు రూ.500 కోట్లు కేటాయించి, సిబ్బందిని నియమించి అభివృద్ధి చేయాలి. ప్రతి జిల్లాలో కనీసం ఒక చేపపిల్లల విత్తన క్షేత్రాన్ని నిర్మించాలి.
- చెరువులు, కుంటలను కబ్జాలు, కాలుష్యం నుంచి రక్షించాలి. చుట్టూ శాటిలైట్ ద్వారా సర్వే చేసి ఫెన్సింగ్ వేయాలి. కబ్జాలు చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి.
- పెండింగ్ ఇన్సూరెన్సు, ఎక్స్‌గ్రేషియో వెంటనే ఇవ్వాలి. సహజంగా మరణించిన మత్స్యకార్మికులకు సంబంధించి ఆయా కుటుం బాలకు రూ.10లక్షల సహాయం అందించాలి. తక్షణ సహాయం కింద రూ.50 వేలు ఇవ్వాలి. కుటుంబంలో ఒకరికి ఎలాంటి షరతులూ లేకుండా నేరుగా సభ్యత్వం ఇవ్వాలి.
- ఎన్సీడీసీ ద్వారా రెండో విడతగా టూ వీలర్స్ (మోటారు బైకులు), ఫోర్ వీలర్ (టాటా ఏసీ, బొలెరో), డీసీఎంలు, వలలు, ఐసాక్సులు, వృత్తిపరికరాలు 90% సబ్సిడీ ధరకు ఇవ్వాలి.
- 50 సంవత్సరాలు దాటిన ప్రతి మత్స్యకారుడికీ రూ.3వేల పెన్షన్ ఇవ్వాలి.
- ప్రతి జిల్లా, మండల కేంద్రాల్లో రూ.20లక్షలతో హెరీల్ సేల్, రిటైల్ చేపల మార్కెట్లు నిర్మించాలి.
- మత్స్య సంపదకు గిట్టుబాటు ధర లేకపోతే, చేపలు చనిపోతే ఇన్సూరెన్సు కల్పిస్తూ చట్టం చేయాలి.
- చెరువుల లూటీలు, మత్స్య సొసైటీలు, మత్స్య సామాజిక తరగతులకు రక్షణ కల్పిస్తూ సామాజిక చట్టం చేయాలి.
- ఎన్సీడీసీ స్కీమ్‌లు/ చేప పిల్లల పంపిణీ పారదర్శకంగా నిర్వహించాలి.
- ప్రతి సొసైటీకీ రూ.20లక్షలతో కమ్యూనిటీ హాల్ నిర్మించాలి