Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆన్లైన్ మార్కెటింగ్ సంస్థలతో మరిన్ని ఒప్పందాలు :మంత్రి ఎర్రబెల్లి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
తెలంగాణ పేరు ప్రతిష్టలు ఉట్టిపడేలా, మహిళా ఉత్పత్తులు సులువుగా అంతర్జాతీయ మార్కెట్లో అమ్ముడు పోయేలా కామన్ బ్రాండింగ్ చేయాలనీ, అందుకు తగ్గట్టు పలు పేర్లను పరిశీలించాలని సెర్ప్ అధికారులను పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ఆదేశించారు. ఆకర్షణీయమైన ప్యాకింగ్, లేబిలింగ్ కోసం ప్రయత్నాలు చేయాలని సూచించారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి కార్యదర్శి, సెర్ప్ సీఈఓ సందీప్ కుమార్ సుల్తానియా, పంచాయతీరాజ్ కమిషనర్ హనుమంతరావు, సెర్ప్ అధికారి రజిత, ఇతర అధికారులతో మంగళవారం హైదరాబాద్లోని తన క్యాంపు కార్యాలయంలో డ్వాక్రా ఉత్పత్తులపై మంత్రి సమీక్ష నిర్వహించారు.