Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- డీజీపీ అంజనీకుమార్
నవతెలంగాణ-ప్రత్యేక ప్రతినిధి
ప్రతి ఏటా జరగే ఆల్ ఇండియా పోలీసు డ్యూటీమీట్లు పోలీసుల ప్రతభకు మరింత వన్నెను చేకూరుస్తాయని రాష్ట్ర డీజీపీ అంజనీకుమార్ అన్నారు. మంగళవారం తన కార్యాలయంలో 66 భూపాల్‌లో జరిగిన 66వ ఆల్ ఇండియా పోలీసు డ్యూటీ మీట్లో వివిధ పతకాలను సాధించిన రాష్ట్ర పోలీసు అధికారులను డీజీపీ సన్మానించారు. ఈ సంధర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర పోలీసు డ్యూటీమీట్‌ను కరోనా కారణంగా నిర్వహించలేకపోయామని అయితే ఆల్ ఇండియా పోలీసు డ్యూటీ మీట్లో రాష్ట్ర పోలీసులు వివిధ పోటీల్లో మంచి ప్రతిభను కనబరిచారని ఆయన ప్రశంసించారు. ముఖ్యంగా డ్యూటీమీట్లలో రాష్ట్ర పోలీసులు ప్రతి ఏడాది మంచి ప్రతిభను కనబరించి అవార్డులు, పతకాలను సాధిస్తున్నారనీ, అది మునుముందు మరింతగా ఇనుమడింప చేయాలని కోరారు. ఈ సందర్భంగా ఆల్ ఇండియా పోలీసు డ్యూటీ మీట్లో పతకాలు సాధించిన సైంటిఫిక్ ఏయిడ్స్ టు ఇన్వెస్టిగేషన్లో బంగారు పతకాన్ని సాధించిన ఎల్బీనగర్ ఇన్స్పెక్టర్ ఎ.మన్ మోహన్, కంప్యూటర్ అవేర్ నెస్, ప్రోగామ్రింగ్లో వెండి పతకాన్ని సాధించిన ఎస్ఐబీ ఎస్ఐ బి. వెంకటేష్, ఇదే విభాగంలో సీఐ సెల్‌కు చెందిన హెడ్ కానిస్టేబుల్ విజరుకు వెండి పతకం లభించడంతో వారిని అధికారులు అభినందించారు. పలురంగాల్లో బహుమతులు పొందిన బాలనగర్ కానిస్టేబుల్ ఎ. అనీల్‌కుమార్, జి.తిరుపతి, జి.రామకృష్ణలను కూడా డీజీపీ, ఇతర సీనియర్ పోలీసు అధికారులు సన్మానించి, అభినందించారు.