Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కన్హా శాంతి వనంలో ప్రారంభమైన ఇంటర్నేషనల్ బయోమి సదస్సు
- హాజరైన జాతీయ, అంతర్జాతీయ ఫార్మా నిపుణులు
నవతెలంగాణ-రంగారెడ్డి ప్రాంతీయ ప్రతినిధి
ఫార్మా రంగంలో హైదరాబాద్ దేశ రాజధానిగా మారిందని పలువురు అంతర్జాతీయ ఫార్మా నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేశారు. మంగళవారం రంగారెడ్డి జిల్లా శంషాబాద్ సమీపంలోని కన్హా శాంతివనంలో తెలంగాణ రాష్ట్ర గిరిజన గురుకుల విద్యాలయాల సంస్థ ఆధ్వర్యంలో 3 రోజుల పాటు జరిగే ఇంటర్నేషనల్ బయోమి-2023 కాన్ఫరెన్స్‌ను మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా సోషల్ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ విద్యార్థుల కోసం వివిధ రంగాల్లో ప్రసిద్ధి చెందిన జాతీయ, అంతర్జాతీయ ప్రొఫెస ర్లతో అవగాహనా సదస్సు నిర్వ హించారు. ప్రారంభ సదస్సుకు సంస్థ సెక్రెటరీ రోనాల్డ్ రాస్ హాజరై మాట్లాడారు. బయో, ఫార్మా రంగంలో ఎన్నో మార్పులు జరుగు తున్నాయని, వాటికి అను గుణంగా నూతన పరిశోధనలు జరగాల్సిన అవ సరం ఉందన్నా రు. ఇటీవల కరోనా వైరస్ కారణ ంగా ప్రజలు తీవ్ర స్థా యిలో ఇబ్బందులు ఎదుర్కొన్నారని, దేశ ఆర్థిక వ్యవస్ధకు విఘాతం కలి గిందని తెలిపారు. ఈ విపత్కర పరిస్థితుల్లో మన బయో, ఫార్మా రంగం ప్రపంచ మానవాళిని కాపాడిందని తెలిపారు. ఆ విధంగా విద్యార్థులు కూడా ఇప్పటి నుంచే నూతన పరిశోధనా అంశాలపై దృష్టి సారించాలని, సమాజానికి మనం ఎంతో సేవ చేయాల్సిన అవసరం ఉందన్నారు. సదస్సులో అమెరికా టోలెడో యూనివర్సిటీ ప్రాఫెసర్ స్కాట్ హాల్, ఫ్రాన్స్ ఎంబసీ అధికారి స్టాన్స్, కేంద్ర ప్రభుత్వ డ్రగ్స్ కంట్రోలర్ డాక్టర్ రాం కిషన్, హైదరాబాద్ కేంద్రీయ విశ్వ విద్యాలయం ప్రొఫెసర్ రెడ్డన్న, ఫార్మా ఇండిస్టీ రంగం నిపుణులు, డాక్టర్ శశికుమార్, ప్రొఫెసర్ పన్నుర్ సెల్వం, డాక్టర్ దర్శనా జోషి, ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అధికారులు, వేలాది మంది ట్రైబల్ గురుకుల కళాశాలల విద్యార్థులు పాల్గొన్నారు.