Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నిర్మాతల మండలికి మంత్రి శ్రీనివాస్ గౌడ్ వినతి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
తెలుగు సినిమాల్లో తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు పెద్ద పీట వేయాలని రాష్ట్ర సాంస్కృతిక శాఖ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ కోరారు. తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలి ఎగ్జిక్యూటివ్ మెంబర్గా ఎన్నికైన డాక్టర్ ప్రతాప్ రామకృష్ణ గౌడ్ మంగళవారం హైదరాబాద్లో మంత్రిని కలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... సినీ పరిశ్రమలో తె లంగాణకు చెందిన కళాకారులను గుర్తించి ప్రోత్సహించాలని సూచిం చారు. రాష్ట్రంలోని పర్యాటక కేంద్రాలలో నామమాత్రపు ధరలకు సినిమా షూటింగ్లకు అనుమతిస్తున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలం గాణ రాష్ట్ర గౌడ సంఘం అధ్యక్షులు పల్లె లక్ష్మణరావు గౌడ్ పాల్గొన్నారు.