Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కొత్తూరు
రంగారెడ్డి జిల్లా కొత్తూరు మున్సిపాలిటీ కేంద్రంలోని వింటేజ్ క్లాసిక్ వెంచర్‌లోని ఫామ్‌హౌజ్‌లో సోమవారం అర్ధరాత్రి పోలీసులు హైటెక్ వ్యభిచార ముఠా గుట్టును రట్టు చేశారు. యాంటీ ఉమెన్ ట్రాఫికింగ్ యూనిట్ ( ఏటీహెచ్యూ), స్థానిక పోలీసులకు అందిన విశ్వసనీయ సమాచారం మేరకు ఫామ్‌హౌస్‌పై దాడి చేశారు. ఈ ఘటనలో యువతితో పాటు ఐదుగురు విటులను అరెస్ట్ చేశారు. వారిని కొత్తూరు పోలీస్ స్టేషన్‌కు తరలించారు. స్థానికులు, కొత్తూరు సీఐ బాలరాజు తెలిపిన వివరాల ప్రకారం.. మహేశ్వరం మండలం సుభాన్‌పూర్ గ్రామానికి చెందిన బొల్లు శ్రీకాంత్, పెద్ద తండాకు చెందిన పాత్లావత్ రాజు, చిన్న తూప్రా గ్రామానికి చెందిన సంకటి నాగరాజు, మన్సాన్పల్లి గ్రామానికి చెందిన పెండ్లిమడుగు నవీన్, నల్లచెరువు తండాకు చెందిన దన్నుల రవిలు వెస్ట్ బెంగాల్ రాష్ట్రానికి చెందిన ఒక యువతిని ఆన్లైన్లో బుక్ చేసుకున్నారు. ఆమెను కొత్తూరు మున్సిపాలిటీ పరిధిలోని వింటేజ్ క్లాసిక్ వెంచర్‌లోని ఫామ్‌హౌస్‌లోకి తీసుకొచ్చారు. అక్కడ అసాంఘిక కార్యక్రమాలు జరుగుతుండగా సోమవా రం మధ్య రాత్రి సుమారు రెండు గంటల ప్రాంతంలో ఫామ్‌హౌస్‌పై పోలీసు లు దాడి చేశారు. వారిని అరెస్టు చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. వీరి నుంచి మూడు కార్లు, 9 సెల్ ఫోన్లు, రూ.16 వేల నగదుతో పాటు 20 కండో మ్ ప్యాకెట్లను సైతం స్వాధీనం చేసుకున్నారు. మరో ముగ్గురు వ్యభిచార ముఠా నిర్వాహకులు పరారీలో ఉన్నారు. నిందితులను రిమాండ్‌కు తరలిం చారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.