Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : అతి పెద్ద రేడియో నెట్వర్క్ అయినా రేడియో సిటీ తాజాగా హైదరాబాద్ మెట్రో రైల్ (హెచ్ఎంఆర్)తో భాగస్వామ్యం కుదుర్చుకున్నట్టు తెలిపింది. ఇది నగరంలోని ప్రముఖ మెట్రో స్టేషన్లలో తమ బ్రాండ్ గుర్తింపును పెంచుకోవడానికి ఒక అవకాశమని పేర్కొంది. తమ లోగోను 10 మెట్రో స్టేషన్లలో ప్రవేశ ద్వారాల వద్ద ప్రదర్శించే ఏర్పాట్లు చేసినట్లు తెలిపింది. తమ బ్రాండ్ విస్తృతికి ఇది దోహదం చేయ నుందని రేడియో సిటీ చీఫ్ క్రియేటివ్ ఆఫీసర్ కార్తీక్ కల్లా పేర్కొన్నారు.