Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్బ్యూరో
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పునరాభివృద్ధిలో భాగంగా చేపట్టిన టోపోగ్రఫీ (స్థలాకతి) సర్వే, భూసార పరీక్షలు పూర్తయ్యాయి. ప్రయాణీకుల సేవలకు ఎలాంటి అంతరాయం లేకుండా ప్రధాన భవనాన్నీ, తాత్కాలిక కార్యాలయాల ఏర్పాటు పనులు వేగంగా జరుగుతున్నాయని దక్షిణ మధ్య రైల్వే మంగళవారంనాడొక పత్రికా ప్రకటనలో తెలిపింది. అలాగే కొత్త ఆర్పీఎఫ్ భవన నిర్మాణం కోసం పునాది పనులు ప్రారంభమయ్యాయి. కొత్తగా రాబోతున్న ఉత్తర టెర్మినల్, దక్షిణ టెర్మినల్, మల్టీ లెవల్ కార్ పార్కింగ్, టూ లెవల్ స్కై కాన్కోర్స్, ఫుట్ ఓవర్ బ్రిడ్జిల నిర్మాణాలకు సంబంధించిన ప్రణాళికల్ని కాంట్రాక్టర్ సమర్పించారు. వచ్చే 40 ఏండ్లలో ప్రయాణికుల అవసరాలను తీర్చే విధంగా స్టేషన్ భవనాన్ని నిర్మిస్తున్నారు. స్టేషన్లో ప్రయాణీకుల నీటి అవసరాలను తీర్చడానికి 16 లక్షల లీటర్ల సామర్థ్యంతో వాటర్ ట్యాంకులు నిర్మిస్తున్నారు. దీనికోసం భూగర్భ ట్యాంకులు, ఓవర్ హెడ్ ట్యాంకుల నిర్మాణానికి స్థలాలు గుర్తించారు. కేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖ రూ.700 కోట్లు వ్యయంతో ఈ నిర్మాణ పనుల్ని చేపడుతున్న విషయం తెలిసిందే. 2025 అక్టోబర్ నాటికి ఈ ప్రాజెక్ట్ పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.