Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జయేష్ రంజన్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ఒఎన్డీసీతో డిజిటల్ వ్యాపారం లో కీలకమైన మార్పులు జరగబోతు న్నాయని పరిశ్రమలు ఐటీశాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్ తెలి పారు. మంగళవారం హైదరాబాద్ రెడ్‌హిల్స్‌లోని ఎఫ్‌టీసీసీఐ కార్యాల యంలో 'మీ వ్యాపారాన్ని వృద్ధిలోకి తీసుకుపోవడంలో ఒఎన్‌డీసీ (ఓపెన్ నెట్వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్) ఉప యోగపడుతుంది....' అనే అంశంపై సదస్సు నిర్వహించారు. ఈ సంద ర్భంగా జయేష్ రంజన్ మాట్లాడు తూ ఒఎన్‌డీసీ విజయానికి కాంచీ పురం చీరల అమ్మకమే ఉత్తమ ఉదా హరణ అని తెలిపారు. కేరళ రాష్ట్రం ఆన్లైన్ స్టోర్స్ కు పూర్తిగా సహకరి స్తున్నదని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఓఎన్ డీసీ ప్రారంభించడాని కంటే ముందే తెలంగాణ గ్లోబల్ లింకర్‌ను ప్రారంభించామనీ, 12 వేల మధ్య, చిన్న, సూక్ష్మ తరహా పరిశ్రమలు ఇందులో భాగస్వాములయ్యాయని తెలిపారు. ఈ రిటైల్ మార్కెట్ భారతదేశంలో 4.3 శాతముండగా, చైనా 25 శాతం, దక్షిణ కొరియాలో 26 శాతం, యుకెలో 23 శాతంతో ఉ న్నాయని ఒఎన్‌డీసీ బిజినెస్ ఆఫీ సర్ శిరీష్ జోషి తెలిపారు. ప్రపంచ వ్యా ప్తం ఓగా ఒఎన్ డీసీకి ప్రత్యామ్నా యం లేదని స్పష్టం చేశారు. గ్లోబల్ లింకర్ డైరెక్టర్ మాళవిక జగ్గి మాట్లా డుతూ వ్యాపారస్తులు ఎవరైనా సరే గ్లోబల్ లింకర్ నెట్‌వర్క్‌లో 10 నిమి షాల్లో తమ కేటలాగ్‌ను అప్లోడ్ చే సి చేరొచ్చని తెలిపారు. భారత పరి శ్రమల శాఖ ప్రత్యేకాధికారి విత్సల మిశ్రా మాట్లాడుతూ ప్రపంచ ఇ-కా మర్స్లో భారతదేశం 1.5 శాతం వాటా కలిగి ఉందనీ, 2030 నాటికి ఇది 2 శాతానికి పెరుగుతుందని ఆ శాభావం వ్యక్తం చేశారు. ఎఫ్‌టీసీసీఐ అధ్యక్షులు అనిల్ అగర్వాల్, ఎఫ్‌టీసీసీఐ ఐసీటీ కమిటీ సీఈవో కాయతీ నర్వానే పాల్గొన్నారు.