Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మాజీ ఎంపీ వి హనుమంతరావు
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
రాహుల్‌గాంధీ నిర్వహించిన భారత్ జోడోకు మద్దతుగా మార్చి 22 నుంచి 25 వరకు భారత్ జోడో క్రికెట్ టోర్నమెంట్ నిర్వహిస్తామని మాజీ ఎంపీ వి హనుమంతరావు వెల్లడించారు. రాజీవ్ గాంధీ పేరుతో 15 ఏండ్ల నుంచి క్రీడా పోటీలు నిర్వహిస్తున్నామని వివరించారు. మంగళవారం హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో ఆయన విలేకర్లతో మాట్లాడారు. ఈసారి భారత్ జోడో ఆలిండియా అండర్ 19 టీ 20 క్రికెట్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నామన్నారు. ఈ పోటీల్లో దేశ వ్యాప్తంగా 17 టీమ్స్ పాల్గొంటాయని తెలిపారు.
బాలుడి కుటుంబాన్ని ఆదుకోవాలి
కుక్కల దాడిలో మరణించిన బాలుడి కుటుంబాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని వీహెచ్ డిమాండ్ చేశారు. హైదరాబాద్‌లో కుక్కల వలన చాలా మంది పిల్లలు చనిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కుక్కల నియంత్రణ చేపట్టాలన్నారు. వీధి కుక్కలను నియంత్రణ చేయకపోతే చిన్న పిల్లలపై దాడులు పెరుగుతాయని హెచ్చరించారు.