Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
యూత్ కాంగ్రెస్ నేత తోట పవన్‌పై దాడికి పాల్పడిన బీఆర్ఎస్ కార్యకర్తలను వెంటనే అరెస్టు చేయాలని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క డిమాండ్ చేశారు. రేవంత్‌రెడ్డి నిర్వహించిన హాత్ సే హాత్ జోడో యాత్రలో పాల్గొన్న పవన్‌పై బీఆర్ఎస్ కార్యకర్తలు దాడి చేయడం అప్రజాస్వామిక చర్య అని పేర్కొన్నారు. దాడిని ప్రోత్సహించిన, దాడికి పాల్పడిన నిందితులను వెంటనే పోలీసులు అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. దాడిని ఖండిస్తూ రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్, యూత్ కాంగ్రెస్ నిర్వహించిన ఆందోళన కార్యక్రమాలను పోలీసులు అడ్డుకోవడం సరికాదని తెలిపారు.